పవన్ కళ్యాణ్ నుంచే నేర్చుకున్నా.. సీక్రెట్ చెప్పిన నిధి అగర్వాల్!

యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే ఫోకస్ చేశారు. హిందీ ఫిల్మ్ 'మున్నా మైఖేల్' సినిమాతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి హిందీ సినిమాలకు కాస్తా దూరమైంది. నెక్ట్స్ మూవీ అక్కినేని నాగచైతన్యతో నటించింది. సవ్యసాచీగా తెలుగు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా... నిధి అగర్వాల్ కు మాత్రం తెలుగు ఆడియెన్స్ లో హీరోయిన్ గా గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో మరింతగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నవిషయం తెలిసిందే. ఈ సందర్భంగా రీసెంట్ గా ఓఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకుంది. హరిహర వీరమల్లు చిత్రంలో నటించడాన్ని తను అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. హరిహర వీరమల్లు సినిమాలో తన పాత్ర ఇప్పటి వరకు తను చేసిన అన్ని సినిమాల్లో కంటే చాలా ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడింది. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడం పట్ల గర్వంగా ఉందని తెలిపింది.

Nidhhi Agerwal pawan kalyan

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. పవన్ కళ్యాణ్ సెట్స్ లో చాలా సింపుల్ గా ఉంటారంది. అందరితోనూ ప్రేమగా, మర్యాదగా ఉంటారని చెప్పుకొచ్చింది. ఇక సెట్స్ లోకి ఎంటరైతే ధ్యాస మొత్తం స్క్రిప్ట్ చదువుతూనే నిలుపుతారని తెలిపింది. ఆయన ఎంతో ఏకాగ్రతతో వర్క్ విషయంలో ఉంటారని తెలిపింది. ఒక్కసారి డైరెక్టర్ యాక్షన్ చెప్తే క్షణాల్లోనే యాక్టింగ్ మోడ్ లోకి వచ్చేస్తారని తెలిపింది. చుట్టూ ఎన్ని డిస్టబ్జెన్సెస్ ఉన్నా ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఉంటారని తెలిపింది. సీన్ పైనే మొత్తం దృష్టి పెడుతారని చెప్పింది.

అలా ఏకాగ్రతగా సెట్స్ లో ఉండటం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే నేర్చుకున్నాని చెప్పింది. ఆయనతో కలిసి వర్క్ చేస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక తను ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్ డ్యాన్స్, కథక్ కూడా నేర్చుకున్నానని తెలిపింది. దీంతో తన కల నిజమైందని చెప్పుకొచ్చింది. తనకు హారర్ర్ చిత్రాలంటే చాలా భయం అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాతో అయినా నిధి అగర్వాల్ కెరీర్ లో మంచి ఫలితం అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X