టాలీవుడ్ లో దుమ్ములేపుతున్న ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుప్టటారా? ఈరోజు ఆమె బర్త్ డే

మరాఠి ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లో దుమ్ము లేపుతోంది. 10 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లోనూ ఆమె మంచి అవకాశాలను అందుకుంటోంది. భారీ చిత్రాల్లో కీలక పాత్రలకు, ఫీమేల్ లీడ్ కు ఎంపిక అవుతూ షాక్ ఇస్తోంది. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పాత ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎన్ని సినిమాలు చేసింది? ఎన్నో బర్త్ డేను జరుపుకుంటోందనే వివరాల్లోకి వెళితే..

33వ ఏట అడుగు పెడుతూ..
ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫొటో ఎవరిదో కాదు.. సీతారామం చిత్రంలో నూర్జహాన్ పాత్రలో మెప్పించిన మృణాల్ ఠాకూర్ దే కావడం విశేషం. ఆ ఫొటో తన కెరీర్ ప్రారంభంలోని కావడం గమనార్హం. ఇక మృణాల్ ఠాకూర్ ఈరోజు 33వ పుట్టిన రోజును జరుపుకుంటుండటం విశేషం. ఆమె మహరాష్ట్రలోని ధూలే ప్రాంతంలో 1992 ఆగస్టు 1న జన్మించింది. ప్రస్తుతం ఆమె పుట్టిన రోజు వేడుకలను అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా నిర్వహించారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మృణాల్ ఠాకూర్ ఫొటోలను, సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tollywood Actress Old pic Gone Viral on the Occation of her birthday

లవ్ సోనియాతో సెన్సేషన్ గా..
2018లో ప్రేక్షకుల మందుకు వచ్చి హిందీ చిత్రం లవ్ సోనియా. ఈ చిత్రంతోనే మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాను ఇండియా, లాస్ ఏంజెల్స్, హాంకాంగ్ వంటి దేశాల్లో నిర్మించారు. తబ్రేజ్ నూరానీ దర్శకత్వం వహించారు. వైరల్ గా మారిన పిక్ ఈ చిత్రంలోనే కావడం విశేషం. ఇద్దరు అక్కాచెళ్లలు వ్యాపారంలో చిక్కుకొని ఎలా బయటికి వచ్చారనేది ఈ సినిమా కథ. చిత్రానికి మృణాల్ ఠాకూర్ నటనతో చాలా అవార్డ్స్ దక్కాయి. విమర్శకుల ప్రశంసలు అందాయి. మెల్ బోర్న్, లండన్ ఇండియన్ ఫెస్టివల్స్ అవార్డ్స్ ను అందుకుంది.

టాలీవుడ్ లో భారీ ఆఫర్స్..
సీతారామం చిత్రం తర్వాత మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటూ వచ్చింది. నేచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టర్ చిత్రంలోనూ నటించి మెప్పించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీలోనూ చిన్న పాత్రలో ఆకట్టుకుంది. ఆ తర్వాత సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కావడం విశేషం.

మరోవైపు నెక్ట్స్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న AA22xA6 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో 5 గురు హీరోయిన్లు నటిస్తుండగా అందులో ఒకరిగా ఎంపికైంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక అడివి శేష్ డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ, హిందీలో హై జవానీ థో ఇష్క్ హోనా హై, తుమ్ హో థో, పూజా మేరీ జాన్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X