twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా సోకింది అనగానే పక్కున నవ్వేసిన పాయల్.. చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి!

    |

    కరోనా వైరస్ ప్రపంచం వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి భయాన్ని కలిగిస్తోంది. పేద, ధనిక అని తేడా లేకుండా ఈ మహమ్మారి ఊహించని విధంగా మనిషిని దెబ్బ కొడుతోంది. కంటికి కనిపించకుండా ఎన్నో విధాలుగా భయపెడుతున్న ఈ వైరస్ పై వస్తున్న రోజుకో వార్త ఆందోళనను కలిగిస్తోంది. అయితే ఇటీవల ఒక హీరోయిన్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

    Recommended Video

    Ravi Teja Silent In Disco Raja Movie Success Press Meet
    హాస్పిటల్ లో ఊసరవెల్లి హీరోయిన్..

    హాస్పిటల్ లో ఊసరవెల్లి హీరోయిన్..

    మంచు మనోజ్ కథానాయకుడిగా నటించిన ప్రయాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ ఘోష్. ఈ బ్యూటీ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో సైడ్ హీరోయిన్ గా దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ బ్యూటీ అస్వస్థతకు గురవ్వడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. దీంతో ఆమెకు కరోనా సోకిందని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వార్తలు వచ్చాయి.

    షాకైన సెలబ్రెటీలు..

    షాకైన సెలబ్రెటీలు..

    పాయల్ ఘోష్ కరోనా భారిన పడిందని వార్తలు రాగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. మరో సినీ సెలబ్రెటీకి కూడా పాజిటివ్ వచ్చిందని తెలియగానే కొంతమంది సినీ తారలు వెంటనే పాయల్ కి ఫోన్ చేశారట. ఆమె ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీసారట. ఇక కొన్ని రోజుల క్రితం ఆమెతో సన్నిహితంగా ఉన్న వారు కూడా ఆందోళన చెందారట.

    పక్కున నవ్వేసిన పాయల్..

    పక్కున నవ్వేసిన పాయల్..

    విషయం తెలుసుకున్న పాయల్ పక్కున నవ్వేసిందట. తాను ఆస్పత్రిలో చేరిన విషయం వాస్తవమేనని అయితే నిజంగా తనకు కరోనా సోకలేదని క్లారిటీ ఇచ్చింది. కావాలంటే రిపోర్ట్స్ పంపిస్తానని చెబుతూ.. తనకు మలేరియా మాత్రమే వచ్చిందని అమ్మడు ఆమె సన్నిహితులకు వివరణ ఇచ్చింది. ఇక మీడియాలో వస్తున్న పుకార్లు అబద్ధమని చెప్పిన పాయల్ నిజానిజాలు తెలుసుకోకుండా ఏవి నమ్మవద్దని తెలిపింది.

    బలంగా నమ్ముతున్నా...

    బలంగా నమ్ముతున్నా...

    ఇక ప్రస్తుత పరిస్థితులపై కూడా ఈ బ్యూటీ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. పాయల్ మాట్లాడుతూ.. 'కరోనా వైరస్ ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, డాక్టర్లు అలాగే చాలా మంది మన కోసం కష్టపడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పరిస్థితులు కనిపిస్తుండడంతో తప్పకుండా మనం మునుపటిలానే సంతోషంగా ఉండే రోజులు వస్తాయని నేను బలంగా నమ్ముతున్నా' అని ఈ బ్యూటీ వివరణ ఇచ్చింది.

    English summary
    Young Bengali actress Payal Ghosh, who was seen in Manchu Manoj’s Prayanam and NTR’s Oosaravelli, laughed off the reports of her getting infected with the deadly Coronavirus. She clarified that she is only suffering from malaria. Getting into the details, for the last few days, Payal has been down with fever and cough, which are the preliminary symptoms of Coronavirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X