Payal Rajput: ఈ హీరోయిన్లదంరికీ ఏమవుతుంది.. మొన్న సామ్, నిన్న సునైన, నేడు పాయల్!
ఈ ముధ్య కాలంలో మనం ఎక్కువుగా హీరోయిన్ల ఆరోగ్యం బాగాలేదనే వార్తలు వింటున్నాం. ముఖ్యంగా పేరు మోసిన హీరోయిన్లు ఆరోగ్య సమస్యలతో బాధ పడడం తరచుగా వినిపిస్తోంది. మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ సమంత పరిస్థితి సరిగ్గా లేదు. మయోటైటిస్ తో బాధ పడుతున్న ఆమె అనేక ఇబ్బందులు పడింది. తరచుగా ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ అందరినీ షాక్ కు గురి చేసింది. ఇప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి అలాగే ఉంది. ఇక తాజాగా సుసైన కూడా తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
కారణం ఏంటో చెప్పకపోయినా.. ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోలను షేర్ చేసింది సునైన. విపరీతమైన ట్రోల్స్ వస్తే.. గట్టిగా ఆన్సర్ చేస్తూ.. త్వరలోనే తాను ఆరోగ్యంగా మారి బయటకు వస్తానని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా తాను ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఆమె మంగళవారం సినిమాలో నటిస్తుండగా.. ఆ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సందర్భంగానే తన ఆరోగ్య పరిస్థితిని బయట పెట్టింది. తనకు ఉన్న వ్యాధి గురించి వెల్లడించింది.

మంగళవారం సినిమా కోసం అజయ్ తనను సంప్రదించే వరకూ తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తలియదని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. అప్పుడు తాను కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధ పడుతున్నట్లు చెప్పింది. వైద్యులు కచ్చితంగా తాను సర్జరీ చేయించుకోవాలని చెప్పారట. కానీ ఈ క్యూట్ బ్యూటీకి.. మంగళవారం సినిమా కథ విపరీతంగా నచ్చే సరికి ఆరోగ్య పరిస్థితిని పక్కన పెట్టేసి సినిమా చేస్తానని చెప్పిందట. అలాగే వైద్యుల వద్దకు వెళ్లి తాను ఈ సినిమా చేశాకే సర్జరీ చేయించుకుంటానని అందట.

అప్పటి వరకు తాను ఆరోగ్యంగా ఉండేలా ట్రీట్ మెంట్ చేయమని చెప్పిందట హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అలా తరచుగా వైద్యుల వద్దకు వెళ్తూనే.. ఈ సినిమాలో నటించినట్లు పేర్కొంది. ఈ సినిమా ట్రైలర్ రిజీల్ అయిన కాసేపటికే వైరల్ గా మారడం చూస్తుంటేనే కచ్చితంగా హిట్టు అవుతుందనే నమ్మకం వస్తుందని వెల్లడించింది. తన కెరియర్ ఏమైపోతుందో అని భయపడుతున్న క్షణంలో ఈ సినిమా ఆఫర్ వచ్చిందని.. పాయల్ రాజ్ పుత్ స్పష్టం చేసింది.

మొదటి సినిమా ఆర్ఎక్స్ 100లో ఛాన్స్ ఇచ్చి తనతు విపరీతమైన క్రేజ్ ఇచ్చేలా చేసిన అజయ్ భూపతి.. మరోసారి తనకు ఛాన్స్ ఇచ్చాడని పాయల్ రాజ్ పుత్ వెల్లడించింది. అప్పటిలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తనకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కు థాంక్స్ చెప్పింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పపాటు దివ్య పిళ్లై, ప్రియదర్శి, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దయానంద రెడ్డిలు ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్టు అవుతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











