లైవ్ లో ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టాలీవుడ్ నటి
టాలీవుడ్ నటి పూనమ్ బజ్వా తెలుగులో పెద్దగా సినిమాలు చేకపోయినా.. తన రూపసౌంద్యం, నటనతో తెలుగు అభిమానుల్లో కొద్దిపాటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ప్రస్తుతం వెండితెరపై పెద్దగా మెరియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ వారిని ఖుషి చేస్తోంది. ఈ క్రమంలో సమయం ఉన్నప్పుడల్లా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా తను లైవ్ చాట్ నిర్వహించగా నెటిజన్ నుంచి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అందుకు పూనమ్ బజ్వా ఇచ్చిన సమాధానం హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ముంబై టు టాలీవుడ్..
పూనమ్ బజ్వా బాంబేలోని పంజాబీ ఫ్యామిలీకి చెందింది. అమర్జిత్ సింగ్ బజ్వా, జయలక్ష్మి దంపతులకు 1985 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె తండ్రి నవల్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి 40 ఏళ్లు దాటినా ఆమె ఇంకా బ్యాచిలర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. ప్రస్తుతం తన దగ్గరకు వచ్చిన సినిమాలు చేస్తోంది. లేదంటే ఫ్యామిలీతోనే సమయం గడుపుతూ ఉంది. ఇక ఆమెకు చెల్లి దీపికా బజ్వా ఉంది. మరోవైపు పూనమ్ బజ్వా 2005లో మిస్ పూణె టైటిల్ ను అందుకుంది. అలాగే పలు ఫ్యాషన్ అండ్ ర్యాంప్ వాక్ ఈవెంట్స్ లో పాల్గొని ఆకట్టుకుంది. దాంతో టాలీవుడ్ లో తొలి చిత్రానికి హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

పూనమ్ బజ్వా తెలుగు చిత్రాలు..
తెలుగు ప్రేక్షకులకు పూనమ్ బజ్వా మొదటి చిత్రం అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ చిత్రం 2005లో విడుదలైంది. ఆ తర్వాత 2006లో ప్రేమంటే ఇంతే, బాస్ వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే వేడుక, పరుగు, ఎన్టీఆర్ : కథానాయకుడు వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైంది. 2005 నుంచి 2022 వరకు వరుసగా సినిమాలు చేస్తోంది. గత 3 ఏళ్లుగా పూనమ్ బజ్వా నుంచి ఎలాంటి సినిమాలు లేవు.
నెటిజన్ ప్రశ్నకు కంగుతిన్న నటి..
తాజాగా పూనమ్ బజ్వా తన అభిమానులు, నెటిజన్లతో సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ ను ASK Anything అనే సెషన్ నిర్వహించింది. దీంతో ఫ్యాన్స్ ఆమె అభిరుచులు, అందమైన ఫొటోల గురించి అడిగారు. పూనమ్ బజ్వా కూడా సమాధానం ఇచ్చింది.
కానీ ఒక నెటిజన్ మాత్రం పూనమ్ బజ్వాను పూజా అని పిలిచి అప్సెట్ చేశాడు. అంతే కాదు పూజా జీ ఐ లవ్ యూ అంటూ అడిగాడు. దీంతో టాలీవుడ్ నటి పూనమ్ బజ్వాకు కోపం వచ్చింది. అది నువ్వు పూజాను అడగాలి.. నేనైతే లవ్ చేయను? అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఫ్యాన్స్ తో కన్వర్జేషన్ ను పూనమ్ బజ్వా సోషల్ మీడియా వేదిక పంచుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











