Poonam kaur: ఆ స్టార్ హీరో నన్ను ఎక్కడపడితే అక్కడ.. పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్..
Poonam Kaur: హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరుచు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తోంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. మరో సంచలన ట్వీట్‌తో ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ సార్ట్ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. వివరాల్లోకెళ్లే..
పూనమ్ కౌర్ పంజాబీ అమ్మడు.. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి తన కేరిర్ ను ప్రారంభించింది. ఈ ఫేమ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'మాయాజాలం' మూవీతో సీల్వర్ స్కీన్ పై మెరిసింది. తొలి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఈ అమ్మడు కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు.. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఈ బ్యూటీ నటించింది.. తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ షోతో కుర్రకారు మదిలో నిలిచిపోయింది.

అయితే.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులకు తెలియజేస్తుంటుంది. అలాగే.. ఆమె పరోక్షంగా కౌంటర్లు వేస్తుంటుంది. ఎవర్ని ఉద్దేశించి ఆ పోస్టు పెట్టిందో కచ్చితంగా చెప్పలేం. అలా ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. సంచలన పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్.
ఈ అమ్మడుకు త్రివిక్రమ్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు. గానీ, అవకాశం దొరికినప్పుడల్లా.. దర్శకుడు త్రివిక్రమ్‌లపై తన అక్కస్సును వెల్లాబుచ్చుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అలా కొంతకాలం నుంచి ట్వీట్ వార్ చేస్తోంది పునమ్ కౌర్. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. ఈ సంచలన ట్వీట్‌తో టాలీవుడ్ లోప్రకంపనలు సృష్టించింది. ఈసారి ఏకంగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోను టార్గెట్ చేసింది. ఆ స్టార్ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఓ ఎక్స్ వేదిక గా ఓ షాకింగ్ ట్వీట్ చేసింది పూనమ్.

పూనమ్ తన ట్వీట్‌లో ఇలా రాసుకోచ్చింది. ' నేను తెలుగులో ఓసోసియే ఫాంటసీ సినిమాలో నటించా.. ఆ సినిమాలో నాతోపాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. అయితే కొన్ని నీళ్లు గా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎందుకు సినిమాలు మానేసిందో ఎవరికి తెలియదు. కానీ ఇటీవల ఓ డొమెస్టిక్ ఫ్లైట్లో ఆ అమ్మాయి నన్ను కలిసింది. తాను పెళ్లికి షాపింగ్ వచ్చానని, ఓ ఓ షాకింగ్ విషయాన్ని చెపుతూ.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుంది.' అని పేర్కొంది.
పూనమ్ ఇంకా కంటిన్యూ చేస్తూ.. ' ఆ నటి ఎమోషనల్ అవుతూ ఇలా చెప్పింది. తనతో నటించిన ఓ స్టార్ హీరో.. అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఆ హీరో తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. నిత్యం తనని ఫాలో చేస్తున్నడనీ, యూఎస్ వెళ్లినప్పుడు అతడు కూడా అదే ఫ్లైట్లో వచ్చాడని, అతని కారణంగానే ఇండస్ట్రీ వదిలి యుఎస్ వెళ్లి చదువుకుంటున్నారని వివరించింది' అంటూ పూనం కౌర్ షాకింగ్ ట్వీట్ చేసింది. అయితే ఆ హీరో హీరోయిన్లు ఎవరనే విషయాన్ని పూనమ్ వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయంగా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? వేధింపులకు పాల్పడుతున్న ఆ స్టార్ హీరో? అనేది ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications











