రెండోసారి గర్భవతి‌గా నటి పూర్ణ.. బేబీ బంప్‌‌తో అఖండ యాక్టర్ పోస్ట్ ట్రెండింగ్

ఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి పూర్ణ (షమ్నా ఖాసీం). తన అందంచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. మలయాళీ అందం పూర్ణకు అల్లరి నరేష్ 'సీమ టపాకాయ్'సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ మూవీతో పాపులర్ నటిగా మారారు. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'అవును' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు. ఇటీవలే నాని దసరా మూవీలో కూడా నటించి అదరగొట్టారు. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు నెట్టింట్లో 'ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను'అని చేసిన పోస్ట్ తెగవైరల్ అవుతోంది. ఇంతకీ ఏమన్నారంటే?

టాలీవుడ్‌లో హీరోయిన్‌ పూర్ణ వరుస సినిమాలతో మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా ఆమె అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. 'అవును', 'అవును 2', 'సీమ టపాకాయ్', 'దృశ్యం 2', 'అఖండ', 'దసరా' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత తన కెరీర్ కు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూ మరోవైపు పలు టీవీ షోలు, కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఇటీవల బాలకృష్ణ నటించిన 'అఖండ 2: తాండవం' సినిమాలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tollywood Actress Poorna Shares Emotional Baby Bump Post 9 Months of a Beautiful Journey
ఇక హీరోయిన్ పూర్ణ వక్తిగత జీవితానికి వస్తే.. ఆమె 2022లో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షనిద్ ఆసిఫ్ అలీను రహస్యంగా వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇప్పటికే హమ్దాన్ ఆసిఫ్ అలీ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు పూర్ణ మరోసారి గర్భం ధరించి రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న ఆమె, తాజాగా మెటర్నిటీ ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఆమె చేసిన భావోద్వేగ పోస్ట్ నెటిజన్లను కదిలించింది. 'తొమ్మిది నెలల అందమైన ప్రయాణం... మాటల్లో చెప్పలేని అనుభూతి' అంటూ పూర్ణ తన గర్భధారణ అనుభవాన్ని వివరించింది. ముఖ్యంగా తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇద్దరు 'ఉమ్మాలు' ప్రేమగా తనను అలంకరించిన క్షణం జీవితాంతం మర్చిపోలేనిదిగా నిలిచిపోయిందని చెప్పింది. ఆ సమయంలో తనకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని పేర్కొంది. కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయత తనకు ఎంతో బలాన్ని ఇస్తున్నాయని తెలిపింది.

ఇక తన డెలివరీ సమయం దగ్గరపడుతుండటంతో కొంత ఉత్సాహం, కొంత ఆందోళన కూడా ఉన్నాయని పూర్ణ వెల్లడించింది. "నా కోసం, నా బిడ్డ కోసం ప్రార్థనలు చేయండి. అల్లాహ్ దయతో నాకు సురక్షితమైన ప్రసవం జరగాలని, ఆరోగ్యంగా ఉన్న బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాను" అంటూ ఆమె అభిమానులను కోరుకుంది. కొత్త జీవితం, కొత్త ఆశీర్వాదం, కొత్త ఆరంభం తన జీవితంలో ప్రారంభం కానుందని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ ముద్దుగుమ్మకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more about: tollywood shamna kasim poorna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X