నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. వారికి నా సమాధానం ఇదే.. నటి ప్రగతి ఎమోషనల్

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి (Pragathi) ఇటీవల మరోసారి తన ప్రతిభను నిరూపించారు. నటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ప్రగతి, 50 ఏళ్ల వయసులోనూ పవర్ లిఫ్టింగ్‌లో భారత్ తరపున నిలబడి ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు సాధించడం విశేషం. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 లో ఆమె ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘనతను సాధించిన తర్వాత ప్రగతి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, ఈ విజయంతో పాటు ఆమె ఎదుర్కొన్న విమర్శలు, ట్రోలింగ్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది.

'3 రోజెస్' వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటి ప్రగతి భావోద్వేగానికి గురయ్యారు. తాను పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే 'ఈ వయసులో జిమ్‌కు వెళ్లడం అవసరమా?', 'ఇలా డ్రెస్ వేసుకుని వర్కౌట్ చేయడం ఏమిటి?'అని చాలా మంది సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ చేశారని భాధతో తెలిపారు. జిమ్ డ్రెస్సులపై వచ్చిన వ్యక్తిగత విమర్శలు, తన వయసును ఎత్తిచూపుతూ వచ్చిన అవమానకర వ్యాఖ్యలు తానెక్కడో తప్పు చేస్తోన్నానేమోననే సందేహం కలిగించాయని హర్ట్ టచ్చింగ్ కామెంట్స్ చేసింది.

Tollywood Actress Pragathi Wins 4 Medals in Asian Powerlifting Gives Powerful Reply to Trolls

ప్రగతి మాట్లాడుతూ..'నా కూతురు పెద్దది అయింది. ఆమెపై ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న భయం నాకు ఎక్కువగా ఉండేది" అని ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో ఈ ప్రతికూలతలను తన బలంగా మార్చుకుని, మరింత కఠినంగా ప్రాక్టీస్ చేసి, చివరకు అంతర్జాతీయ వేదికపై నాలుగు పతకాలు సాధించడం తనకే కాదు, దేశానికీ గర్వకారణమని పేర్కొన్నారు. పవర్ లిఫ్టింగ్ చేస్తోంది కాబట్టి సినిమాలు మానేసిందని వచ్చిన ప్రచారంపై కూడా ప్రగతి స్పష్టతనిచ్చారు.

'నేను సినిమాలు ఎప్పటికీ వదలను. సినిమాలు లేకపోతే నేను బతకలేను. నా ఇంటి రెంట్ నుంచి, ఈరోజు నేను తినే అన్నం వరకు అన్నీ సినిమాతోనే వచ్చాయి'అంటూ భావోద్వేగంగా చెప్పారు. పాత్రలు రావడంలో చిన్న గ్యాప్ వచ్చిందని, కానీ ఇప్పుడు మళ్లీ కొత్త పాత్రలు, ముఖ్యంగా తమిళంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ విజయాన్ని సొంతంగా సాధించలేదు, అది మొత్తం సినీ కుటుంబానికేనని ఆయన అన్నారు. తన పతకాలను ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క మహిళా కళాకారిణికి అంకితం చేస్తున్ననని ప్రగతి గర్వంగా ప్రకటించారు.

ట్రోలర్స్ కు దీటుగా సమాధానమిస్తూ.. ఒక మహిళ ఫోటో పెట్టినా దాని కింద అసభ్యకర కామెంట్లు వేయడం ఎంత దారుణమో అన్నారు. 'మాకు కుటుంబం ఉంటుంది, గౌరవం ఉంటుంది, బాధ ఉంటుంది. అది ఎవరూ ఆలోచించరు. కామెంట్ చేసే ముందు ఒక నిమిషం ఆలోచించండి. మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా"అంటూ ఎమోషనల్ అయ్యారు. చివరగా తనను సత్కరించిన '3 రోజెస్' టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం నటి ప్రగతి కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. సోషల్ మీడియా ట్రోల్స్, నెటిగివ్ కామెంట్స్ ను పట్టించుకోకుండా.. దాదాపు 50 సంవత్సరాల వయసులో ఇలాంటి ఘనత సాధించడం ప్రశంసనీయమే అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: tollywood actress pragathi trolls
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X