Punarnavi Bhupalam: అందాల విందుతో తెగించిన పునర్నవి.. మితిమీరిన గ్లామర్ షో!
పునర్నవి భూపాలాం.. అలియాస్ పున్నూ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ 2013లో వచ్చిన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. సునీతగా కనిపించి అందరినీ తెగ అలరించింది. ఆమె చేసిన అద్భుతమైన నటనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలోనూ శర్వానంద్ కూతురుగా కనిపించి మెస్మైజ్ చేసింది. ఇక ఆ తర్వాత పిట్టగోడ, సైకల్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.
1996లో మార్చి 28వ తేదీన తెనాలిలో పుట్టిందీ ముద్దుగుమ్మ. 2013 నుంచి ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ముందుకెళ్తోంది. ఈక్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడిపి చాలా రోజుల పాటు ఇంట్లో కొనసాగింది. ఎక్కువగా వితికా శేరు, వరుణ్ సందేశ్... రాహుల్ సిప్లిగంజ్ లతో మాత్రమే ఉండి.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఆమె బిగ్ బాస్ లో ఉండగా.. ఆమె అందాలకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చేశారు. ఎవరూ ఊహించని స్థాయిలో అభిమానులను పొందిన ఈ ముద్దుగుమ్మ బయటకు వచ్చాక మాత్రం పెద్దగా కనిపించలేదు.

తాము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకుంటూ తరిగిన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిలు.. బయట మాత్రం పెదదగా కలవేదు. అలాగ్ బిగ్ బాస్ షో నుంచి వచ్చేశాకా.. ఆమె చదువుల పేరుతో విదేశాలకు వెళ్లిపోయింది. అక్కడే స్నేహితులతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూనే ఉంది. అయితే ఈ మధ్యే ఈ ముద్దుగుమ్మ ఇండియాకు వచ్చింది. వచ్చాకా రాహుల్ సిప్లిగంజ్ ను కూడా కలిసి ఆయన పాట ప్రమోషన్స్ లో పాల్గొంది. వీరి జంటకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉండగా.. మొన్న వీరిద్దరూ కలిసినప్పటి ఫొటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఫొజోలు పెట్టింది. ముఖ్యంగా అర్ధ నగ్నంగా కనిపించి అందరికీ షాకిచ్చింది. కింద బ్లాక్ జీన్స్ వేసుకున్న ఈ క్యూట్ బ్యూటీ.. పైన ఏమీ వేసుకోకుండానే కూర్చొని ఫొటోలు దిగింది. ముందు మొత్తం పుస్తకాలు పరుచుకొని కూర్చున్న ఈమె.. ఇంత హాట్ గా కనిపించడంతో అంతా షాకయ్యారు. పెద్ద ఎత్తున ఈమెను ట్రోల్ చేస్తున్నారు. నువ్వు నిజంగానే చదువుకుంటున్న, గ్లామర్ షో చేస్తున్నావా అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు.
సినిమాల్లోనూ ఛాన్సుల కోసమే ఇలా చేస్తున్నావా.. మరీ ఇంత గ్లామర్ షో అవసరమా అంటూ అడుగుతున్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చినా ఆమె మాత్రం వాటికి నో చెప్పింది. చదువుకోవడానికి విదేశాలకు వెళ్లిపోయింది. మరి ఇప్పుడైనా సినిమాల్లో కనిపిస్తుందా లేదా అనేది చూడాలి.



Click it and Unblock the Notifications











