నా లవర్ లో ఈ క్వాలిటీస్ నచ్చాయి.. పూర్తిగా ఓపెన్ అయిన రష్మిక మందన్న

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తను నటించిన గత మూడు నాలుగు చిత్రాలను ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇలా కెరీయర్ పరంగా రష్మిక మందన్నకు ఎలాంటి ఢోకా లేదు. ఇక రష్మిక మందన్నకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ గానే ఉండటంతో ఆమె గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తుంటారు. ఈ క్రమంలోనే రష్మిక మందన్న కూడా తన ఫ్యాన్స్ కోసం కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ వస్తోంది. కాగా ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

నేషనల్ క్రష్ గా..
రష్మిక మందన్న తొలుత కన్నడ చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గ్గా మారింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కిర్రాక్ పార్టీ అనే చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ చిత్రం తర్వాత రష్మిక మందన్నకు మంచి గుర్తింపు దక్కింది. ఇక టాలీవుడ్ లోకి ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, వారసుడు వంటి చిత్రాలతో భారీ సక్సెస్ ను అందుకుంది. యంగ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి నేషనల్ క్రష్ గా పేరు దక్కించుకుంది.

Tollywood Actress Rashmika Mandanna Open Comments

విజయ్ దేవరకొండతో రిలేషన్?
రష్మిక మందన్న తెలుగులో రెండు చిత్రాల్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో వీరు ఏకంగా లిప్ లాక్ లతో ఆశ్చర్యపరిచారు. దాంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న రిలేషన్ లో ఉందనే నమ్ముతున్నారు. ఇక ఒకరి విషయంలో మరొకరు ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేసుకుంటూ వారి మధ్య ప్రేమ ఉందని కన్ఫమ్ చేస్తున్నారు.

తనకు కాబోయే భర్త క్వాలిటీస్..
ఇప్పటికే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ గురించి కుబేరా మూవీ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండకు సంబంధించినవి అన్నీ నాకే అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక ఇటీవల బాలీవుడ్ మీడియాలో మాట్లాడుతూ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ ను చెప్పుకొచ్చింది. తన లైఫ్ పార్ట్ నర్ కు 'యానిమల్' చిత్రంలో రన్ విజయ్ కు ఉండే లక్షణాలు ఉండాలని, అలాంటి వ్యక్తితో డేట్ కు ఒప్పుకుంటానని చెప్పింది. లవ్ అనేది ఎవ్వరినైనా మార్చేస్తుందని చెప్పుకొచ్చింది. దీంతో ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండ గురించే చెబుతుందంటూ చర్చ జరుగుతోంది.

రాబోయే చిత్రాలు..
యానిమల్, పుష్ఫ 2, ఛావా, సికిందర్, కుబేరా వంటి భారీ చిత్రాలతో వరుసగా భారీ బ్లాక్ బాస్టర్ అందుకుని రష్మిక మందన్న ఇండియాలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నెక్ట్స్ ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మరోవైపు రష్మిక మైసా అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X