For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత సైడ్ ఇన్‌కమ్.. చేతి ఖర్చులన్నీ ఒక్క గంటలోనే రాబడుతున్న జెస్సి!

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత అక్కినేని సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ బ్యూటీ రేంజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకునే జెస్సి ఫ్యాన్ ఫాలోవర్స్ తో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అయితే 15 మిలియన్ల ఫాలోవర్స్ ను అందుకుంది. ఒక విధంగా సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ గా కూడా సమంత రికార్డ్ సృష్టించిందని చెప్పవచ్చు. ఈ బ్యూటీ కేవలం సినిమాలలోనే కాకుండా వివిధ దారుల్లో కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటోంది.

  మార్కెట్ వాల్యూ అస్సలు తగ్గలేదు

  మార్కెట్ వాల్యూ అస్సలు తగ్గలేదు

  సమంత అక్కినేని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ ఇంకా అదే తరహా క్రేజ్ అందుకుంటోంది. ప్రస్తుతం అగ్ర హీరోలతో సినిమాలు చేయక పోయినప్పటికీ కూడా ఆమె మార్కెట్ వాళ్ళు కూడా తగ్గలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటున్నాయి. చివరగా ఆమె చేసిన ఓ బేబి సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత సమంత రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పెరిగింది.

  బాలీవుడ్ లో కూడా ఆఫర్స్

  బాలీవుడ్ లో కూడా ఆఫర్స్

  సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సమంతకు సంబంధించిన షూటింగ్ పనులు అయితే ఫినిష్ అయ్యాయి. ఇక దర్శకుడు గుణశేఖర్ మరొక పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో సమంత రేంజ్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ అయితే వస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆమెకు ఆఫర్స్ కూడా వస్తున్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే

  గంటలోనే భారీ ఆదాయం

  గంటలోనే భారీ ఆదాయం

  సమంత ఆదాయం పై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. సమంత ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారు అనే విషయాన్ని పక్కన పెడితే దానికంటే ఎక్కువగా యాడ్స్ లతోపాటు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారానే సమంత చేతి ఖర్చులకు సరిపడా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని బ్రాండెడ్ దుస్తుల కోసం గాని బ్యాంకుల కోసం గాని ఫోటో షూట్ లో పాల్గొంటున్న సమంత గంట కంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించడం లేదట.

  సైడ్ ఇన్‌కమ్ 1.5కోట్లు

  సైడ్ ఇన్‌కమ్ 1.5కోట్లు

  ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి పోస్ట్‌కు 7-13 లక్షల మధ్య ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి ఆ ధరలో 70% వసూలు చేస్తుందట. లూయిస్ విట్టన్, నీమన్, నీతా లుల్లా, మై ఫిట్‌నెస్, మింత్రా, డ్రూల్స్, అన్‌కాడమీ వంటి బ్రాండ్స్ ప్రమోషన్స్ చేసిన సమంత అతి తక్కువ కాలంలోనే 1.5కోట్ల వరకు ఆదాయాన్ని అందుకున్నట్లు సమాచారం. ఈ విధంగా అమ్మడు తన డైలీ మెయింటైన్స్ కోసం సోషల్ మీడియాను సైడ్ ఇన్ కమ్ గా చేసుకున్నట్లు తెలుస్తోంది.

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  అందులో నిజం లేదని..

  అందులో నిజం లేదని..

  ఇక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె నాగచైతన్య తో విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్నో రకాల కథనాలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని సమంత ఒక ఇంటర్వ్యూలో కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి విషయాలపై తను ఏమాత్రం స్పందించనని మీడియాను కుక్కలతో పోల్చిన ఫోటోను కూడా షేర్ చేసుకుంది. ఇక ప్రస్తుతం సమంత తన దగ్గరి సన్నిహితులతో కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది.

  English summary
  Tollywood Actress Samantha akkineni side income details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X