Samantha Ruth Prabhu : మళ్లీ ప్రేమలో.. కానీ ఈసారి సమంత షాకింగ్ కండిషన్స్!

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తెలుగు ఆడియెన్స్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదేళ్లకు పైగా తన నట జీవితంతో దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తన టాలెంట్, విభిన్న పాత్రల్లో ఆమె నటన తీరుకు ప్రశంసలు అందుకుంది. స్టార్ హీరోలకు ధీటుగా పెర్ఫామ్ చేసి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది సమంత. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరీ ముఖ్యంగా సామ్ ఫోకస్ ప్రస్తుతం నార్త్ పైనే పెట్టినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. సమంత తన అభిమానులకు ఎంతలా ప్రియార్టీ ఇస్తుందో తెలుస్తోంది. సినిమా అప్డేట్స్ తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్ తో నిర్మోహమాటంగా పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత తన జీవితంలో మళ్లీ ప్రేమ విషయంపై స్పందించినట్టు తెలుస్తోంది. ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Tollywood Actress Samantha Ruth Prabhu made Key Decision for her life Here is the details

సమంత రూత్ ప్రభు గతంలో మయోటైసిస్ వ్యాధి బారిన పడి చికిత్స పొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమంత రూత్ ప్రభు తన సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ ను చక్కదిద్దుకునే పనిలోనే నిమగ్నమైంది. అందుకు తగిన విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. హెల్త్ సెట్ చేసుకునేందుకు ఏడాది పాటు సినిమాలకు దూరంగా కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువగా అవకాశాల కోసం ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే సమంత ప్రముఖ దర్శకుడు రాజ్ తో ప్రేమలో పడిందనే రూమర్లు గట్టిగానే వినిపించాయి. ఈ వార్తలను ఎవరూ ఖండించకపోవడంతో నిజమేనా? అనే సందేహం ఉత్పన్నమైంది.

ఈక్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో సామ్ తన జీవితం గురించి చెప్పిన మాటలు వైరల్ గా మారుతున్నాయి. 'జీవితంలో మళ్లీ ప్రేమలో పడాలని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. వాటిపై ఇంక చర్చించాలనీ లేదు. అది నా పూర్తి వ్యక్తిగతమైన విషయం. దాన్ని అలాగే వ్యక్తిగతంగానే ఉంచుతాను.' అంటూ చెప్పుకొచ్చింది. తన వ్యక్తిగత జీవితాన్ని మరోకరితో పంచుకునేందుకు ఏమాత్రం ఇప్పుడు ఇష్టం లేదని స్పష్టం చేసింది. మరోవైపు సామ్ తన పూర్తి ఫోకస్ ను కేవలం కెరీర్ పైనే పెట్టింది.

ఇక అక్కినేని నాగచైతన్య తో సమంతకు విడాకులైన సంగతి తెలిసిందే. చైతన్య కూడా నటి శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకొని సెకండ్ లైఫ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన జీవితంలో హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత మళ్లీ పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు వచ్చాయి. మరోవైపు 'ది ఫ్యామిలీ మెన్' సిరీస్ దర్శకుడు రాజ్ తో సామ్ రిలేషన్ లో ఉందని బాలీవుడ్, సౌత్ మీడియాలోనూ కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సామ్ చెప్పిన మాటలతో తన వ్యక్తిగత విషయాలు ఎవ్వరికీ తెలిసే ఛాన్స్ లేదని, అవన్నీ అవాస్తవాలని చెప్పే ప్రయత్నం చేసిందనిపిస్తోంది. సామ్ చివరిగా 'సిటాడెల్ : హనీ, బన్నీ' సిరీస్ తో అలరించింది. తన యాక్షన్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. సెకండ్ సీజన్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X