Samantha: సామ్ కు మరో వింత వ్యాధి.. అది మయోసైటిస్ కన్నా డేంజర్ !
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవలీ కాలంలో ఆమె ప్రమేయం లేకుండానే కొన్ని విషయాల్లోకి సెంటర్ ఆఫ్ ది హాట్ టాపిక్ గా మారుతోంది. వరుసగా వార్తల్లో నిలిచింది సమంత. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. తన ఆరోగ్య పరిస్థితి గురించి సంచలన విషయాలను వెల్లడించించింది. ఇంతకీ సమంతకు ఏమైంది? ఆమె ఏ వ్యాధితో బాధపడుతోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.
టాలీవుడ్ హీరోయిన్ సమంత 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు సినిమాల్లో అడుగుపెట్టింది. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో దర్శక, నిర్మాతలు వరుస అవకాశాలు ఇచ్చారు ఈ అమ్మడుకు. దీంతో ఈ బ్యూటీ అతితక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి అగ్రహీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో లైక్‌లు, కామెంట్లతో సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది.

ఇదిలాఉంటే.. తన తొలి హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్ కపుల్స్ గా గుర్తింపు పొందారు. ఏం జరిగిందో తెలియదు. కానీ, ఇరువుల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.ఈ అనూహ్య నిర్ణయంతో ఫ్యాన్స్‌కు భారీ షాక్ ఇచ్చారు. దీంతో ఈ కపుల్ అభిమానులంతా నిరాశ చెందారు. కేవలం ఫ్యాన్సే కాదు.. మూవీ లవర్స్ షాక్ గురి చేశారు. ప్రస్తుతం వేరుగా తమ జీవితం తాము కడుపుతున్నారు.
ఇక నాగచైతన్య నుంచి విడాకుల తర్వాత సమంత మయోసైటీస్ (Myositis) అనే వ్యాధి బారినపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉంది. తన ఆరోగ్యం మెరుగుపడ్డ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది సమంత. టాలీవుడ్ దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ (Honey - Bunny) వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత.
ప్రెజెంట్ ఈ సిరీస్ ప్రమోషన్లలో సమంత ఫుల్ బిజీ బిజీ ఉంది. ఈ క్రమంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. మయోసైటిస్ తో పాటు తనకు మరో భయంకరమైన వ్యాధి వచ్చిందని షాకింగ్ విషయం వెల్లడించింది. సిటాడెల్ షూటింగ్ సమయంలో జరిగిన ఘటన వివరించింది సమంత. ' ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను ఒక్కసారిగా అంతా మర్చిపోయాననీ, అంతా మతిమరుపు వచ్చిందన్నారు. సమయంలో ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితిని ఎవరూ గుర్తించలేదు. కనీసం తనని ఎవరు కూడా ఆసుపత్రికి తీసుకెళ్లలేదని బాధపడింది.

అసలు తన ఏమైందోననే విషయాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదనీ, ఇదంతా మయోసైటిస్ కారణంగానే వచ్చిందా అంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే తాను సెట్స్ పైకి వచ్చే వరకు నిర్మాతలు వెయిట్ చేసినందుకు థ్యాంక్యూ అంటూ తన బాధను వెల్లడించింది సమంత. ఏది ఏమైనా సమంత ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడం చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె తర్వగా కోల్కోవాలని అన్నారు. ఇక ప్రస్తుతం సమంత కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











