భర్తతో హీరోయిన్ సంగీత విడాకులు.. స్పందించిన సీనియర్ నటి
తెలుగు ప్రేక్షకులను ఎంతోగానో అలరించి హీరోయిన్ సంగీత. 25 ఏళ్లకు పైగా నటి సంగీత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో అలరిస్తూ ఉంది. అయితే ఇప్పటికే సంగీతకు పెళ్లై పిల్లలకు కూడా ఉండటంతో సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక పాత్రలు, విభిన్న రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే నటి సంగీత గురించి ఆ మధ్యలో ఓ బాధాకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. తన డివోర్స్ తీసుకోబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై రీసెంట్ గా ఆమె ఇలా స్పందించింది.
డివోర్స్ రూమర్స్ ఇలా..
నటి సంగీత 1997 నుంచి చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తోంది. తన కెరీర్ ఫుల్ జోష్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. ప్రముఖ సింగర్ క్రిష్ ను ప్రేమించి పెళ్లాడింది. వీరిద్దరికి 2009లో తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో కుటుంబ పెద్దలు, బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య వివాహాం జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉండింది. 16 ఏళ్లుగా వీరి దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగుతోంది.

అయితే సంగీత తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతుందంటూ కొద్ది కాలంగా వార్తలు వచ్చాయి. అందుకు కారణం ఆమె తన సోషల్ మీడియాలో అకౌంట్స్ పేరును మార్చడమే. నార్మల్ ఆమె సంగీత క్రిష్ అని సోషల్ మీడియా హ్యాండిల్స్ కు నేమ్ ఇచ్చింది. ఇక కొద్ది రోజుల కింద భర్త క్రిష్ పేరును తొలగించడంతో ఈ రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ విడాకుల పుకార్లపై ఎప్పుడూ ఆమె స్పందించలేదు. కానీ తాజాగా ఆ రూమర్లకు చెక్ పెట్టింది.
తాజాగా రాఖీ పూర్ణిమ కావడం, శ్రావణ మాసంలోని రెండో శుక్రవారం కావడంతో ఇంట్లో వరలక్ష్మి వ్రతం నోమింది. ఈ సందర్భంగా తన కూతురు శ్రియాతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇదే సమయంలో ఆ ఫొటోస్ ను తనతో పాటు తన భర్త సింగర్ క్రిష్ కు కూడా ట్యాగ్ చేసింది. అలాగే ఇటీవల కూడా భర్తతో కలిసిన కొన్ని వీడియోలను పంచుకుంటూ వచ్చింది. ఇలా ఆమె విడాకుల రూమర్లకు అడ్డుకట్ట వేసింది. ఇక ఆమె అభిమానులు కలకాలం ఇలాగే సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నారు.
సీనియర్ నటి సంగీత చెన్నైలో పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు భానుమూర్తి, అరవింద్. ఆమె తాత కేఆర్ బాలన్ సినిమా నిర్మాత కావడం విశేషం. ఆయన కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 20కి పైగా తమిళ సినిమాలను నిర్మించారు.నటి సంగీత తండ్రి అరవింద్ చాలా సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. వారి బాటలో నటి సంగీత కూడా పయనించింది. నటిగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో మెరిసింది. హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో ఆశల సందడి, నవ్వుతూ బతకాలిరా, మా ఆయన సుందరయ్య, ఖడ్గం, ఈ అబ్బాయి చాలా మంచోడు, పెళ్ళాం ఊరెళితే, ఆయుధం, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, అదిరిందయ్యా చంద్రం, కారా మజాకా, సరిలేరు నీకెవ్వరు, చివరిగా మసూద వంటి చిత్రాలతో అలరించింది.


Click it and Unblock the Notifications











