వెస్టిండీస్ క్రికెటర్ తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీలు.. హోటల్ గదిలో అలా.. ఆ జ్ఞాపకాలు వైరల్

సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ అలాగే క్రికెటర్స్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు ఆ రూట్ లో చాలామంది డేటింగ్ చేసి కొన్నాళ్లు ప్రేమలో కూడా కొనసాగారు. మరి కొంతమంది పెళ్లి వరకు వెళ్లారు. ఇక మరికొందరు అయితే కేవలం డేటింగ్ వరకే నైట్ పార్టీల వరకే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఆ లిస్టులో మరో టాలీవుడ్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా ఉంది. ఈ బ్యూటీ గతంలోనే క్రికెటర్స్ తో లవ్ లో ఉన్నట్లుగా కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇక ఒక వెస్టిండీస్ క్రికెటర్ తో కూడా ఆమె పార్టీలలో పాల్గొంది అంటూ అనేక రకాల వార్తలు అయితే వచ్చాయి. ఇక మరోసారి ఆమెకు సంబంధించిన ఒక గాసిప్ కూడా వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...

మొదట్లో బిజిగానే..: స్నేహ ఉల్లాల్ మొదట మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఇక ఈ బ్యూటీ ఆ తర్వాత మెల్లగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి అక్కడ కూడా మొదట్లో అయితే కొంత సక్సెస్ అందుకుంది. తెలుగులో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో అప్పట్లో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

 sneha ullal

మళ్ళీ సక్సెస్ రావడానికి..: అయితే మొదటి సినిమా సక్సెస్ అయిన తర్వాత స్నేహ ఉల్లాల్ కు మళ్లీ సక్సెస్ రావడానికి కూడా కాస్త టైం పట్టింది. ఈ బ్యూటీ కరెంట్ అలాగే మరికొన్ని చిన్న తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఇక మంచు మనోజ్ 'నేను మీకు తెలుసా' అనే మరో సినిమా చేసింది. ఇందులో ఆమె గ్లామర్ డోస్ కట్టిగానే పెంచింది. కానీ అవేమీ కూడా ఆమెకు రేంజ్ను పెంచలేకపోయాయి.

బాలయ్యతో హిట్ మూవీ: ఒక స్నేహ ఉల్లాల్ కు చాలాకాలం తర్వాత నందమూరి బాలకృష్ణ ద్వారా సక్సెస్ అందింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ బ్యూటీకి మళ్లీ మంచి టైం వచ్చింది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆమెకు మళ్ళీ మరో సక్సెస్ అయితే దక్కలేదు. దీంతో కేవలం గెస్ట్ పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అప్పట్లో క్రికెటర్ తో అలా..: ఇక సినిమాలకు కొంత కాలం పాటు గ్యాప్ ఇచ్చిన అమ్మడు పర్సనల్ లైఫ్ లో స్నేహితులతో ఇతర సెలబ్రిటీలతో నైట్ పార్టీలలో లైఫ్ మా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అయితే ఆ మధ్యకాలంలో అమ్మడు ఒక వెస్టిండీస్ క్రికెటర్ తో క్లోజ్ గా బాండింగ్ ఏర్పరచుకుంది అని అనేక రకాల కథనాలు అయితే వెలువడ్డాయి. 2016లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తో కూడా ఆమె నైట్ పార్టీలో పాల్గొని ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

 sneha ullal

మరోసారి కలిశారా? : అప్పట్లో అయితే ఆమె డైరెక్ట్ గా క్రిస్ గేల్ తో నైట్ పార్టీలో చాలా బాగా ఎంజాయ్ చేసాము అని ఆ తర్వాత హోటల్లో కూడా ఉన్నట్లుగా ఆమె హింట్ ఇవ్వడంతో ఊహించని విధంగా కథనాలు వైరల్ అయ్యాయి. ఇక ఆ తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి కనిపించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ హడావిడి మొదలు కావడంతో క్రిస్ గేల్ మళ్లీ స్నేహ ఉల్లాల్ కలిసినట్లుగా కూడా సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం అయితే స్నేహ ఉల్లాల్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ పై అమ్మడు ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X