Sreeleela Kids : ఇద్దరు పిల్లలకు తల్లైన శ్రీలీలా.. పెళ్లి కాకుండానే ఇలా?

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీలీలా పేరు ముందుంటుంది. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువగానే భావించాలి. నటనలో యువతరాన్ని తన వైపు తిప్పుకుంటున్న తన గొప్ప మనసుతోనూ ప్రశంసలు అందుకుంటోంది. భారీ ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కర్తవ్యాలను మాత్రం మర్చిపోవడం లేదు.

తాజాగా శ్రీలీల గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం 23 ఏళ్లు ఉన్న శ్రీలీలా తల్లిగా ప్రమోషన్ పొందడమే ఆ వార్త సారాంశం. ఈ వార్త వినగానే చాలామంది అభిమానులు పలు రకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శ్రీలీలా తల్లిగా మారడానికి కారణం ఏంటంటే... ఈ యంగ్ బ్యూటీ 2022లో ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించింది. ఆ సమయంలో ఇద్దరు వికలాంగులైన చిన్నారులను చూసి ఎంతో ఎమోషనల్ అయ్యిందని, వారితో తనకు ఏదో సంబంధం ఉందనే భావన కలిగి దత్తత తీసుకుందంట.

Tollywood Actress Sreeleela is a Mother to 2 kids Without Marriage how it is possible Here is

ఆ ఇద్దరు చిన్నారులకు మెరుగైన జీవితాన్ని అందించాలని నిర్ణయించుకుందంట. వెంటనే అడాప్ట్ చేసుకుని వారి పోషణ మొత్తం తానే చూసుకుంటోందని, ఎలాంటి లోటు లేకుండా తల్లిగా మారి జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు సమాచారం. అయితే శ్రీలీలా ఈ నిర్ణయాన్ని తన 'టూలవ్' చిత్రానికి ముందే తీసుకుంట. ఇక అప్పటి నుంచి ఆ పిల్లలను దత్తత తీసుకొని తల్లిగా ప్రమోషన్ పొందింది. ఆ మధ్యన చిన్నారులకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఖుషి అవుతున్నారు. శ్రీలీలా వయస్సులో చిన్నదైనా గుణంలో గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తన విశాల హృదయానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 23 ఏళ్లకే శ్రీలీలా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని తల్లిగా బాధ్యతలు స్వీకరించడం ఆసక్తికరంగా మారింది.

ఇక శ్రీలీలా ఓవైపు తన విద్యభ్యాసాన్ని పూర్తిచేస్తూనే మరోవైపు సినీ రంగంలో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. కాగా యంగ్ హీరోయిన్ టాలీవుడ్ లో సంచలనంగా మారడమే కాకుండా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. హిందీలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్లు అందుతుండడం విశేషం. అయితే టాలీవుడ్ లో లాగా బాలీవుడ్లో శ్రీలీలా ఏ మేరకు అలరిస్తుందనే విషయాన్ని ఇంకోన్నాళ్లు ఆగి వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శ్రీలీలా చేతిలో అరుడజను చిత్రాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసే పనులు నిమగ్నం అయింది.

నెక్ట్స్ శ్రీలీలా 'రాబిన్ హుడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ - వెంకీ కుడుముల కాంబోలో రెండోసారి వస్తున్న చిత్రమిది. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగుతుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు పాపులర్ క్రికెటర్ డెవిడ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతుండటం విశేషం. మార్చి 28న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఇదేకాకుండా శ్రీలీలా నెక్ట్స్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'తోనూ అలరించనుంది. అలాగే 'పరాశక్తి' వంటి చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ లోనూ 'ఆషికీ3'లో నటించింది. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ సరసన నటించడం మూలంగా డేటింగ్ రూమర్లు పుట్టుకొచ్చాయి. మరోవైపు అబ్రహం అలీఖాన్ తోనూ ఓ మూవీ కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: sreeleela pushpa 2 adopt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X