47 ఏళ్ల వయసులో బికినీలో అందాల జాతర.. అర్ధ నగ్నంగా గ్లామర్ ట్రీట్!
తెలుగు ప్రేక్షకులను విభిన్న పాత్రలతో నటి సురేఖా వాణి అలరిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటిగా తనకు వచ్చిన అవకాశాలను సద్వియోగం చేసుకుంటూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. 20 ఏళ్లుగా సురేఖ వాణి టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే వస్తోంది. నటిగా సురేఖ వాణి ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. తనదైన శైలిలో బిగ్ స్క్రీన్ పై మెరిసి ఆకట్టుకుంది. మాస్ మహారాజా 'భద్ర' చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు నటిగా పరిచయం అయ్యింది.
ఆ తర్వాత హీరో సిద్ధార్థ్ బొమ్మరిల్లు, ప్రభాస్ 'బుజ్జిగాడు', రెడీ, ఏ మాయ చేసావె, నమో వెంకటేశ, నేనింతే, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, బాద్ షా, శ్రీమంతుడు, బెంగాల్ టైగర్, ద్వారక, సుప్రీమ్ వంటి సినిమాల్లో సురేఖ వాణి గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. తెలుగు ఆడియెన్స్ లో ఆమెకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. వరుస చిత్రాలతో బిగ్ స్క్రీన్ పై ఆకట్టుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది.

చివరిగా వాలెంటైన్స్ డే సందర్భంగా కూతురు సుప్రితాతో కలిసి షాకింగ్ లుక్ లో మెరిసింది. ఫుల్ మూన్ ఫుఖేట్ నుంచి అభిమానులతో పంచుకున్న ఫొటోలు అప్పుడు నెట్టింటిని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సురేఖ వాణి మరోసారి షాకింగ్ లుక్ లో మెరిసింది. ఈసారి మరీ అర్ధనగ్నంగా దర్శనమిచ్చి ఇంటర్నెట్ ను హీటెక్కిస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. లేట్ వయస్సులోనూ స్టన్నింగ్ గా మెరుస్తోంది.
తాజాగా సురేఖ వాణి తన రీసెంట్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. బీచ్ లో సాయంత్రం వేళ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కనిపించింది. కానీ బీచ్ వేర్ లో మతులు పోయేలా దర్శనమిచ్చింది. బ్లాక్ బికినీలాంటి దుస్తుల్లో థైస్ అందాలను ప్రదర్శించి కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేసింది. అర్ధనగ్న ప్రదర్శనతో నెటిజన్ల గుండెలకు తూట్లు పొడిచేసింది.
యంగ్ బ్యూటీగా దర్శనమిచ్చి తన ఫిట్ నెస్ ను చూపించింది. 47 ఏళ్ల వయస్సులోనూ ఇలా దర్శనమిచ్చింది. తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. చూపుతిప్పుకోని లుక్ లో ఇంటర్నెట్ ను బ్రేక్ చేసేలా స్టిల్స్ ఇచ్చిందని, అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక కూతురు సుప్రితను కూడా హీరోయిన్ గా పరిచయం చేసేందుకు సురేఖవాణి ఎంతగానో ప్రయత్నిస్తోంది. సుప్రిత కూడా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకునేందుకు తనకు వీలైనంత వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
గతంలో సుప్రితా ఓ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది. బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ అమర్ దీప్ కు జోడీగా ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంకా ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఉంది. ఇదిలా ఉండగానే.. ఇటీవల పీలింగ్స్ విత్ సుప్రితా అనే ప్రోగ్రామ్ తో వ్యాఖ్యాతగా గానూ అలరిస్తోంది సుప్రిత. ఇక సురేఖవాణి గతేడాది 'పారిజాత పర్వం', 'హనీమూన్ ఎక్స్ ప్రెస్', వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం 'నోట్ బుక్' అనే మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











