’నా కుతూర్ని అలానే పెంచుతా.. అలాంటి బట్టలే వేస్తాం‘

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. 20 ఏళ్లుగా సురేఖ వాణి టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే వస్తోంది. ప్రస్తుతం సీనియర్ నటిగా తనకు వచ్చిన అవకాశాలను సద్వియోగం చేసుకుంటూ వస్తోంది. తను సినిమాల్లో నటిస్తూ మరోవైపు తన కూతురు సుప్రితా కెరీయర్ ను కూడా నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది. కూతురు చేస్తున్న సినిమాలు, టీవీ షోలకు మద్దతుగా నిలుస్తూ తనను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా సుప్రితా హీరోయిన్ గా నటించిన చిత్ర ప్రమోషన్స్ లో సురేఖా వాణి పాల్గొంది. ఈ సందర్భంగా తనకు ఎదురైనా ప్రశ్నలకు షాకింగ్ గా సమాధానాలు ఇచ్చింది.

సురేఖా వాణి తెలుగు సినిమాలు..
టాలీవుడ్ లో సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. 2005 నుంచి ఈమె టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉంటోంది. సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తనదైన శైలిలో బిగ్ స్క్రీన్ పై మెరిసి ఆకట్టుకుంది. మాస్ మహారాజా నటించిన 'భద్ర' చిత్రంలో సపోర్టింగ్ రోల్ లో నటించింది. అలాగే బొమ్మరిల్లు, 'బుజ్జిగాడు', రెడీ, ఏ మాయ చేసావె, నమో వెంకటేశ్, నేనింతే, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, బాద్ షా, శ్రీమంతుడు, బెంగాల్ టైగర్, ద్వారక, సుప్రీమ్ వంటి చిత్రాల్లో నటించింది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంది.

Tollywood Actress Surekha Vani Shocking Comments about her Daughter Supritha

సురేఖా వాణి, సుప్రితల రచ్చ..
సురేఖా వాణి వెండితెరపైనా మెరుస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. తనే కాదు తన కూతురు సుప్రితాను కూడా చూపిస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి తరుచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటారు. వారి డైలీ రోటీన్ లైఫ్ ను తమ అభిమానులకు నిర్మోహమాటంగా చెబుతూ ఉంటారు. అలాగే రీల్స్ చేస్తూ సరదాగా కనిపిస్తూ ఉంటారు. అంతే కాకుండా తమ టూర్లు, వెకేషన్ కు వెళ్తూ సందడి చేస్తుంటారు. ఆ ఫొటోలను, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు.

సుప్రితా సినిమా ఫంక్షన్ లో సురేఖా వాణిపై ప్రశ్నలు..
సురేఖావాణి తన కూతురు సుప్రితా నటించిన కొత్త సినిమా ప్రమోషన్స్ కు తాజాగా హాజరైంది. బిగ్ బాస్ నటుడు అమరదీప్ చౌదరి, సుప్రితా జంటగా నటించిన 'చౌదరి గారి అబ్బాయి నాయుడి గారి అమ్మాయి' చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రస్తుం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆ సినిమాను ప్రమోట్ చేసేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. జోరుగా ఈవెంట్లను నిర్వహించే పనిలో ఉన్నారు. తాజాగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ క్రమంలోనే సుప్రితాపై ప్రశ్నల వర్షం కురిపించారు... మీరిద్దరూ పొట్టి బట్టలు వేసుకుంటారు? తల్లీకూతుర్లు కనిపించే తీరుపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వస్తున్నాయని, పద్ధతి మార్చుకోవాలని చాలా కామెంట్లు వస్తున్న సమయంలో ఎలా స్పందిస్తారని అడిగారు. ఇందుకు సురేఖా వాణి ఆసక్తికరంగా స్పందించింది.

సురేఖా వాణి సమాధానం..
సురేఖా వాణి స్పందిస్తూ.. 'ప్రతి ఒక్కరి ఒక్కో దృష్టి కోణం ఉంటుంది. మా పోస్టులకు అలా స్పందించడం అది వారి పర్సెప్షన్. ఇక అలాంటి కామెంట్లను చూసి ఎలా స్పందించాలి. అసలు స్పందించాలా? వద్దా? అనేది మాకు సంబంధించిని విషయం. మొదట్లో అలాంటి కామెంట్లపై కోపం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కామెంట్లు చూసి నేను, నా కూతురు నవ్వుకుంటున్నాం' అని చెప్పుకొచ్చింది. తన వేసుకునే బట్టలపై ఎవ్వరికీ సమాధానం చెపాల్సిన పనిలేదని ఇలా స్పందించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X