ఇన్నాళ్లకు పెళ్లిపై స్పందించిన త్రిష.. ఎప్పుడు చేసుకుంటానని చెప్పిందంటే?

సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ గురించి తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి దక్షిణాది ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. కెరీయర్ ప్రారంభం అయ్యిన అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను దక్కించుకుంది. ఇప్పటికీ సీనియర్ హీరోయిన్ గా త్రిష బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తోంది. అంతే తన సినిమా రిలీజ్ ల ఈవెంట్లలోనూ పాల్గొంటూ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే త్రిష తన పెళ్లిపైనా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే...

4 పదుల వయస్సులోనూ ఒంటరిగానే..
త్రిష కృష్ణన్ కు సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆమె చిత్రాల కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. త్రిష కృష్ణన్ కూడా తన అభిమానులు మెచ్చే చిత్రాల్లో, పాత్రల్లో నటిస్తూ వస్తోంది. ఇక ఇదే సమయంలో త్రిష కృష్ణన్ అభిమానులు ఆమె పెళ్లి వార్త కోసం కూడా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన నటి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా? అని వెయిట్ చేస్తున్నారు. ఇక 42 వయస్సులోనూ బ్యాచిలర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది.

Tollywood Actress Trisha Krishnan Reacted about her Marriage in Indirect Way

త్రిష పెళ్లిపై తల్లి స్పందన...
కొద్ది నెలల కింద త్రిష కృష్ణన్ పెళ్లి అంటూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. అయితే దీనిపై త్రిష కృష్ణన్ తల్లిగారు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా స్పందించారు. తన కూతురు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని చెప్పింది. ఇంకా కెరియర్ పైనే దృష్టి పెట్టిందని చెప్పుకొచ్చింది. దాంతో అప్పుడు రూమర్లకు చెక్ పడింది. కానీ త్రిష మళ్లీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందనేది అంతటా ప్రశ్నార్థకంగానే మారింది.

తన పెళ్లిపై త్రిష కృష్ణన్ పరోక్ష స్పందన?
రీసెంట్ గా త్రిష కృష్ణన్ థగ్ లైఫ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో త్రిషకు తన పెళ్లిపై పరోక్షంగా పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. అందుకు త్రిష కూడా పరోక్షంగానే బదులిచ్చింది. మరో రెండు మూడు చిత్రాలకు సైన్ చేసిన తర్వాత తన డ్రీమ్ లైఫ్ గురించి చెబుతానని అనింది. దీంతో త్రిష డ్రీమ్ ఫుల్ అవ్వాల్సింది కేవలం సినిమాల వరకేనా, లేకా జీవిత భాగస్వామిని పరిచయం చేసేందుకు ఇంకా సమయం కావాలని అంటుందా? అనే ఇప్పుడు సందేహంగా మారింది. ఏదేమైనా మళ్లీ త్రిష పెళ్లిపై వార్తలు మొదలయ్యాయి.

త్రిష రాబోయే చిత్రాలివే..
ప్రస్తుతం త్రిష కృష్ణన్ తమిళం, తెలుగు భాషల్లో ఒక్కో సినిమాను చేస్తోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' చిత్రంలో నటిస్తోంది. వీరి కాంబోలో 'స్టాలిన్' చిత్రం వచ్చింది. అలాగే సూర్య సరసన 'సూర్య 45' చిత్రంలో నటిస్తోంది. 'ఆరు' తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం విశేషం. ఇక విశ్వంభర చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యం అవుతుంది. ఇక ప్రస్తుతం త్రిష ఈ రెండు చిాత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X