Nabha Natesh: ఇస్మార్ట్ పిల్ల హీటెక్కించే లుక్స్.. క్యూట్ గా చూస్తూనే ఆ అందాలతో మత్తెక్కించే స్టిల్

నభా నటేష్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా కన్నడ తమిళ ఇండస్ట్రీలో తన నటనతో మంచి క్రేజ్ అందుకుంది. అద్భుతమైన లుక్స్ అలాగే అద్భుతమైన నటనా నైపుణ్యంతో, ఆమె దక్షిణ భారత సినిమాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అమ్మడు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ డోస్ పెంచుతూ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇక సమ్మర్ లో ఇటీవల మంచి టూర్ కి వెళ్లిన ఇస్మార్ట్ పాప హీటెక్కించే గ్లామర్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఇక అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ సినిమా ద్వారా..:కర్ణాటకలోని శృంగేరిలో డిసెంబర్ 11, 1995లో జన్మించిన నభా నటేష్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నభా 2015లో కన్నడ చిత్రం "వజ్రకాయ"తో తన కెరీర్ ను ప్రారంభించింది. మొదట ఆమె సపోర్టింగ్ పాత్రలు పోషించింది. ఏది ఏమైనప్పటికీ, తెలుగు చిత్రం "నన్ను దోచుకుందువటే" (2018)లో ఆమె అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రేక్షకుల నుండి దృష్టిని కూడా ఆకర్షించింది.

Tollywood beautiful Actress Nabha Natesh latest beautiful pics viral

ఆ సినిమాతో బిగ్ సక్సెస్:"నన్ను దోచుకుందువటే" సినిమా తరువాత రామ్ మాస్ మూవీ నభా నటేష్ "ఇస్మార్ట్ శంకర్" (2019)లో ఒక మంచి పాత్రలో నటించింది. నాభా మాస నటన భారీ అభిమానులను సంపాదించిపెట్టింది. ఆ సినిమాతోనే అమ్మడికి సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఆఫర్స్ సంఖ్య కూడా అప్పుడే పెరిగింది. ఆ సమయంలో నాభా కెరీర్ ను పర్ఫెక్ట్ ట్రాక్ లోకి వచ్చేలా సినిమాలు చేయాలని అనుకుంది.

Tollywood beautiful Actress Nabha Natesh latest beautiful pics viral

వరుసగా అపజయాలు:అయితే ఈ బ్యూటీకి ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ రాలేదు. వరుసగా చేసిన కమర్షియల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్ కాలేదు. ఏ సినిమా చేసిన కూడా ఆమె కెరీర్ కి అంతగా బూస్ట్ అయితే ఇవ్వలేకపోయాయి. డిస్కో రాజా, సోలో బ్రతికే సో బెటర్ అలాగే అల్లుడు అదుర్స్ ఇలా వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇక నితిన్ తో చేసిన మాస్ట్రో అనే సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలకావడంతో ఆమెకు మళ్ళీ అవకాశాలు పెద్దగా రాలేదు.

Tollywood beautiful Actress Nabha Natesh latest beautiful pics viral

గ్లామర్ ను హైలైట్ చేసే విధంగా:మంచి గ్లామర్ ఉన్నప్పటికీ కూడా నభా ఆశించినంత స్థాయిలో అయితే పెద్ద సినిమాల్లో అవకాశాలు దొరకడం లేదు. అందుకే ఈ బ్యూటీ వీలైనంతవరకు ఎక్కువగా తన గ్లామర్ ను హైలైట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో తరచుగా ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫోటోలు కుర్రళ్ల మతి పోగొట్టేస్తున్నాయనే చెప్పాలి. రీసెంట్ గా కూడా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

చిన్న గౌనులో హీటెక్కించే అందాలు:సమ్మర్ లో కూల్ గా ఒక పిక్నిక్ వెళ్లినట్లుగా నబా స్టైలిష్ ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. చిన్న గౌనులో అమ్మడు చాలా క్యూట్ గా చూస్తూ ఎద అందాలను కూడా మరింతగా హైలైట్ చేసింది. ఇక ఆమె లెగ్స్ అందాలు కూడా అందులో మరింత ఘాటుగా కనిపించాయి. కొంటెగా చూస్తున్న ఈ బ్యూటీ కుర్రాళ్ళ మనసులను మాత్రం ఒక్క క్షణంలోనే దోచేస్తుంది అని చెప్పవచ్చు. ఇక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి ఈ ఫోటోషూట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X