మరోసారి బికినీ వేయడానికి సిద్ధమైన పూజా హెగ్డే.. ఎంత డిమాండ్ చేసిందంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ఎందుకంటే సీనియర్ హీరోయిన్స్ చాలా వరకు రిటైర్మెంట్ కి దగ్గరవుతున్నారు. హీరోలు కూడా వారిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. గ్లామర్ డోస్ ఎంత పెంచుతున్నా కూడా నేటితరం యంగ్ హీరోయిన్స్ కి పోటీని ఇవ్వలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లిస్ట్ లో కొనసాగుతున్న ఏకైక నటి పూజా హగ్డే.

వరుస విజయాలు..
పూజా హెగ్డే లక్కేమిటో గాని ఒకానొక దశలో ఆమె కెరీర్ ముగిసింది అనుకున్న సమయంలో ఒక్కసారిగా క్లిక్కయింది. దువ్వాడ జగన్నాథమ్ సినిమా నుంచి టాలీవుడ్ క్వీన్ గా చక్రం తిప్పుతోంది. పోటీగా ఎవరు వచ్చినా కూడా వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంది. గ్లామర్ విషయంలో ఈ హాట్ బ్యూటీ చాలా మార్పులు చేసిందనే చెప్పాలి.

బికినీ మాయ..
ఎప్పుడైతే పూజా జెగ్డే డీజే సినిమాలో బికినీలో దర్శనమిచ్చిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ చాలా మారింది. అరవింద సమేత, మహర్షి, హౌజ్ ఫుల్ 4 అంటూ వరుస బాక్సాఫీస్ హిట్స్ తో తన స్టార్ ఇమేజ్ ని మరింత పెంచుకుంది. అలాగే హాట్ ఫోటో షూట్స్ తో కూడా ఈ హాట్ బ్యూటీ కుర్రాళ్లను మరింత ఎట్రాక్ట్ చేసింది. చూస్తుండగానే అందరిని డామినేట్ చేస్తూ టాప్ లిస్ట్ లోకి వచ్చేసింది.

బిజీబిజీ..
ప్రస్తుతం పూజా హగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ప్రభస్, అఖిల్ సినిమాలతో పాటు చేతిలో మరో రెండు బడా సినిమాలు ఉన్నాయి. ఓ వైపు రష్మీక మందన్న అమ్మడికి గట్టి పోటీని ఇస్తున్నప్పట్టికి పూజా హెగ్డే తన గ్లామర్ ప్రజెంటేషన్ తోనే ఎక్కువగా క్రేజ్ అందుకుంటోంది. పైగా నటనలో కూడా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటోంది.

మరోసారి బికినీలో..
ఇకపోతే ఈ బ్యూటీ మరోసారి హాట్ బికినీలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పుడిపుడే బిజీ అవుతున్న ఈ బ్యూటీని ఒక సినిమా కోసం బికినీ వేయాలని రిక్వెస్ట్ చేశారట. అయితే అందుకోసం అమ్మడు రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు రెండు కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ బికినీ వేసుకోవడానికి మరికొంత ఎక్కువగా అడుగుతుందట. అంటే దాదాపు రెమ్యునరేషన్ మూడు కోట్లు దాటించేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు హిందీ సినిమాలకు సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ రానున్నాయి.


Click it and Unblock the Notifications











