Nabha Natesh: పొట్టి డ్రెస్సులో నభా దిమ్మదిరిగే లుక్.. మరీ ఇంత ఘాటుగానా?
గ్లామర్ ఎంత ఆకట్టుకున్నా కూడా కొంతమంది బ్యూటీలకు ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రావడం లేదు. ఒకప్పుడు గ్లామర్ విషయంలో కాస్త హద్దులు దాటకుండా కనిపించిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఆ గీత దాటేసి షాక్ ఇస్తున్నారు. ఆ లిస్టులోకి నభా నటేష్ కూడా వస్తుంది. ఇక అమ్మడు ఇటీవల మరింత డోస్ పెంచింది. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోలను చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి సినిమాతోనే మంచి క్రేజ్: నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ నభా నటేష్. మొదటి సినిమాతోనే తన క్యూట్ పెర్వర్మేన్స్ తో ఆడియన్స్ ని తన వైపుకి తిప్పుకున్న ఈ బ్యూటీ తరువాత జూనియర్ జెనీలియా అనే బ్రాండ్ ని ఈ అమ్మడు తెచ్చుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా చేసిన క్యారెక్టర్ నిడివి తక్కువగానే ఉన్న కూడా అందరికి భాగా రీచ్ అయ్యింది.

వరుసగా సినిమాలు చేస్తూ..: తెలుగులో ఇక ఈ బ్యూటీ కమర్షియల్ హీరోయిన్ కావడం ఖాయం అని అందరూ భావించారు. ఆ తరువాత ఆశించిన స్థాయిలో నభా నటేష్ కి అవకాశాలు రాలేదు. ఆమె సాయి ధరమ్ తేజ్ కి జోడీగా సోలో బ్రతుకే సో బెటర్ మూవీలో నటించింది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్, నితిన్ కి జోడీగా మ్యాస్ట్రో చిత్రాలలో నటించింది.

ప్రమాదం వలన గ్యాప్..:చివరి మూడు సినిమాలు ఆమె ఖాతాలో డిజాస్టర్స్ గా చేరినవే. ఆ చిత్రాల తర్వాత ఓ ప్రమాదం కారణంగా ఏడాది పాటు సినిమాలకి దూరంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో చావు బ్రతుకుల వరకు వెళ్ళింది. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకొని యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఈ అమ్మడు ఉంది. అందుకోసం ఈ మధ్య వరుసగా హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తోంది.

సోషల్ మీడియాలో..: ముఖ్యంగా గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హీరోయిన్ అందరూ కూడా సినిమాలు లేదా వెబ్ సిరీస్ లలో అవకాశాలు పెంచుకోవాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో అందాల ప్రదర్శనతో దర్శక, నిర్మాతల దృష్టిలో పడాలి.

టైట్ స్కర్ట్ లో దిమ్మతిరిగే లుక్: ఇప్పుడు నభా నటేష్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోంది.రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతోంది. తాజాగా టైట్ స్కర్ట్ లో ఓ వైపు ఎద అందాలు వయ్యారంగా చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. మరో వైపు థైస్ సొగసులతో టెంప్ట్ చేస్తూ ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక చివరగా వచ్చిన మాస్ట్రో ఓటీటీలో విడుదలవ్వగా దానికి పెద్దగా రెస్పాన్స్ ఏమి రాలేదు. మరి అమ్మడికి ఏవైనా లక్కీ ఆఫర్స్ వస్తాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











