Adah Sharma: మిస్ మ్యాచింగ్‌తో ఆదా మెస్మరైజింగ్ షో.. జీన్స్ మీదకు నగలు, చేతిలో కత్తెరతో ఫోజులు!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆదా శర్మ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఇఫ్పటి వరకు హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె తాజాగా సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ముఖ్యంగా మిస్ మ్యాచింగ్ డ్రెస్ తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. జీన్స్ మీదకు నగలు వేసుకుని.. చేతిలో కత్తెరతో రచ్చ చేస్తోంది. ఆ విషేశాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2008లో 1920 అనే సినిమాతో హిందీలో అడుగు పెట్టిందీ క్యూట్ బ్యూటీ ఆ తర్వాత ఫిర్, హమ్ హై రాహి కార్ కి అనే సినిమాలు చేసింది. ఇక ఆ తర్వాత ఏడాదే అంటే 2014లో హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ కాలు మోపింది. ముఖ్యంగా నితిన్ తో అద్భుతమైన రొమాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. గంటసేపు కిస్ పెట్టే సీన్ లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే ఏడాది హిందీలోనూ హాసి తో ఫసి అనే సినిమా కూడా చేసింది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, రాణా విక్రమ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లోనూ చేసింది.

ఆ తర్వాత గరం, క్షణం, ఇధు నమ్మ ఆలు, కమాండొ2, మీట్ క్యూట్ వంటి సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. గతేడాది కేరళ స్టోరీ సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టింది. అనేక వివాదాల చుట్టూ తీసిన ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమెకు మంచి పేరే వచ్చింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందీ క్యూట్ బ్యూటీ. తనకు సంబంధించిన అదిరిపోయే ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందాలు ఆరబోసింది. లోపల వైట్ షర్టు వేసుకుని పైన బ్లాక్ కలర్ కోట్ వేసుకుంది. అదిరిపోయే అందాలు కల్గిన ఈమె జీన్స్ మీదకు నగలు వేసుకుంది. రెండు పెద్ద పెద్ద నగలు వేసుకుని మిస్ మ్యాచింగ్ తోనే మెస్మరైజింగ్ షో చేసింది. షార్ట్ హెయిర్ కట్ తో స్టైలిష్ గా ఫోజులు పెట్టింది.

అంతేకాదండోయ్ చేతిలో ఓ కత్తెర కూడా పట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలు చూస్తుంటే ఏమీ అర్థం కాకపోయినా.. ముద్దుగుమ్మ అందాలు మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయి. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటోలను చూసేందుకు అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











