34 ఏళ్లలోనే మస్తు మస్తు అందాలు చూపిస్తున్న అచ్చ తెలుగు హీరోయిన్.. ఎవరంటే?
ఈ మధ్య కాలంలో హీరోహీరోయిన్లు.. గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వయసు పెరిగుతున్నా అది కనిపించకుండా.. 20 ఏళ్ల లోపు వాళ్లలా కనిపించేందుతు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్లలో చాలా మందే ఉండగా.. అచ్చమైన తెలుగు హీరోయిన్ అదిరిపోయే గ్లామర్ షో చేసింది. తెలుగు భామే అయినా ఇక్కడి కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఈమె.. తాజాగా స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో సోకులు ఆరబోసింది. నెట్టింట వైరల్ గా మారిన ఆ ఫొటోలపై ఓ లుక్ వేయండి.
అచ్చతెలుగు హీరోయిన్ అయిన ఐశ్వర్యా రాజేష్.. కెరియర్ ఆరంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి ర్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించి మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, మిస్ మ్యాచ్, భూమిక, టక్ జగదీష్, రిపబ్లిక్, నవాబ్, డ్రైవర్ మున, ధ్రువ నక్షత్రం, డియర్ వంటి సినిమాలు చేసింది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసే ఈమె.. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియులకు కూడా దగ్గర అయింది. ముఖ్యంగా అద్భుతమైన నటనను కనబర్చే ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు.

వారికోసమే అన్నట్లుగా ఈ ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంటుకుంటుంది. అలాగే తన అద్భుతమైన అందమైన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో మెరూన్ కలర్ స్లీవ్ లెస్ స్ట్రెయిట్ కట్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది.

తనపై, తన అందాలపై మాత్రమే ఫోకస్ పడేలా ఫొటోలు దిగింది. చిన్న డ్రాప్ లాగా కనిపించే ఇయర్ రింగ్స్ తో పాటు సింపుల్ బ్రేస్ లెట్, ఫింగర్ పెట్టుకుని అందంగా ముస్తాబైంది. అలాగే హెయిర్ లీవ్ చేసి.. తన ఒంపుసొంపులు ఒలకబోసింది. బ్యాగ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ లో ఉండడం... తనపై ఫోకస్ ఎక్కువగా పెట్టేసరికి మరింతం అందంగా కనిపిస్తోందీ ముద్దుగుమ్మ. ఐశ్వర్యా రాజేష్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ అంతా కామెంట్లు చేస్తున్నారు.
34 ఏళ్ల వయుసోలనూ ముగ్ధమనోహరంగా కనిపిస్తున్నావని కొందరు, మస్తు మస్తు అందాలే నీలో దాచుకున్నావంటూ మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ తెలుగు బ్యూటీపై మీరు కూడా ఓ లుక్ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











