32 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. ప్రియుడితో బిడ్డను కనబోతున్న హీరోయిన్.. సీమంతం ఫొటోలు వైరల్!
చాలా మంది హీరోహీరోయిన్లు.. ప్రేమలో పడడం, పెళ్లిళ్లు చేసుకోవడం వారితో ఏవైనా సమస్యలు వస్తే విడాకులు తీసుకుని వేరవడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తుంటే మాత్రం చాలా మచ్చటేస్తుంది. అలాంటి వాళ్లలో ఒకరే హీరోయిన్ అమలా పాల్. గతంలో ఓసారి పెళ్లి చేసుకుని.. భర్తతో విడాకులు తీసుకున్న ఈమె ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. అంతేనా గర్భం కూడా దాల్చి.. అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇలా సంతోషంగా ఉన్న ఈమె ఘనంగా సీమంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అమలాపాల్ గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతశయోక్తి కాదు. బెజవాడ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ 2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 2013లో నాయక్ సినిమాలోనూ కనిపించింది. ఆ తర్వాత అదే ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
జెండాపై కపిరాజు, మేము, ఆమె వంటి చిత్రాల్లోనూ కనిపించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన ఈమె... అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కెరియర్ పీక్స్ ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ ఎ ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో వీరికి వివాహం జరగ్గా.. ఆ తర్వాత మూడేళ్లకే అంటే 2017లోనే విడాకులు తీసుకుని వేరయ్యారు. ఇక ఆ తర్వాత నుంచి సింగిల్ గానే ఉన్న ఈమె ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది.

ముఖ్యంగా తన రెండో పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు రాగా.. ఆమె ఎప్పుడూ స్పందించలేదు. కానీ సడెన్ గా గతేడాది అక్టోబర్ లో ఇన్ స్టాగ్రామ్ వేదికగా... ఓ అద్భుతమైన వీడియో షేర్ చేసింది. అందులో అమలా పాల్ తన స్నేహితులతో కలిసి పబ్బులో ఎంజాయ్ చేస్తుండగా.. ఆమె ముందుకు ఓ వ్యక్తి వచ్చాడు. పెళ్లి ప్రపోజల్ తో వచ్చి.. అమలా పాల్ ను ఆశ్చర్యపరిచాడు. అయితే అమలా పాల్ కూడా ఫుల్ సంతోషంగా అతడితో రెండో పెళ్లికి ఓకే చెప్పింది. అలా తనకు ప్రపోజ్ చేసిన జగదీష్ దేశాయ్ ను అమలా పాల్ పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం తల్లి కాబోతుంది.

తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అనేక విషయాలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన జర్నీని కూడా వివరిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ మూడు అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. అందులో అమలా పాల్ గ్రాండ్ గా సీమంతం చేసుకుంటూ కనిపించింది. సంప్రదాయ పద్దతిలో భర్తతో కలిసి ఈ వేడుక జరుపుకుంది. అందులో పట్టు బట్టల్లో అమలా పాల్, ఆమె భర్త మెరిసిపోతుండగా.. అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటూ వివరిస్తున్నారు. చూడాలి మరి అమలా పాల్ కు పాప పుడుతుందా, బాబు పుడుతాడా అనేది.


Click it and Unblock the Notifications











