Faria Abdullah: నా ఫస్ట్ క్రష్ అతడే.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా.. కానీ!
ఫరియా అబ్దుల్లా.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన టాలెంట్ కల్గిన ఈ క్యూట్ బ్యూటీ.. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ క్యూట్ బ్యూటీ.. తన ఫస్ట్ క్రష్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. చిన్నప్పటి నుంచి అతడంటే పిచ్చి ప్రేమ ఉన్న తాను అతడినే పెళ్లి కూడా చేసుకోవాలనుకుందట. కానీ కుదరలేదట. ఎందుకు కుదరలేదు, అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2021లో జాతి రత్నాలు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చూసేందుకు చాలా పొడవుగా కనిపించే ఈ క్యూటీ తన అందాలు, అమాయకత్వంతో అందరినీ మైమరిపించింది. తొలి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె అదే ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా కూడా చేసింది.

ఆ తర్వాత ఏడాది బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రావణాసుర వంటి సినిమాలు చేసింది. కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయినట్లుగా మరే సినిమా ఆడలేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలే తగ్గట్లేదు. వరసుగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతున్న ఈమె.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్లను పోస్ట్ చేస్తుంటుంది. ఇలా ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా చేసింది.
ముఖ్యంగా ఈ సినిమాను అందరికీ తెలిసేలా చేసేందుకు మూవీ టీంతో కలిసి, సెపరేట్ గా ప్రమోషన్లలో పాల్గొంటుంది. తాజాగా సోలోగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ క్యూట్ బ్యూటీ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకు ఓ వ్యక్తి అంటే ఇష్టం అని వివరించింది. ముఖ్యంగా బబ్లూ అనే ఓ వ్యక్తని చూడగానే తాను చాలా ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చింది. అయితే తాను నర్సరీలో ఉన్నప్పటి నుంచి అతడిని ఇష్టపడేదాన్ని అని తెలిపింది.

అంతేకాకుండా నర్సరీలో ఉండగానే.. అతడిని చూసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు వివరించింది. అంత చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించినట్లు చెప్పిన చిట్టికి ప్రస్తుతం తన ఫస్ట్ క్రష్ ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో కూడా తెలియదని చెప్పింది. ఇదంతా విన్న యాంకర్.. అరేయ్ బబ్లూ ఎక్కడున్నావో వచ్చి ఈ ముద్దుగుమ్మను పెళ్లి చేసుకోరా అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓసారి ఓ క్యూట్ వీడియో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











