39 ఏళ్ల వయసులో అందాలతో హింస పెడుతున్న హంసా.. కలర్‌ఫుల్ డ్రెస్‌లో కళ్లు చెదిరేలా!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ హంసా నందిని గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం 39 ఏళ్ల వయసు. కానీ చూసేందుకు మాత్రం 20 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తూ.. కుర్రకారును మాయ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను నెట్టింట వదులుతూ.. కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తుంది. తాజాగా ఈమె కలర్ ఫుల్ డ్రెస్ వేసుకుని కళ్లు చెదిరే షో చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హంసా నందిని అసలు పేరు పూనం బర్దాడే. మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మకు డైరెక్టర్ వంశీ పేరు మార్చారు. ముఖ్ంయగా అనుమానాస్పదం సినిమా సమయంలోనే ఈమెకు హంసా నందిని అని నామకరణం చేశారు. 2002లో మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2004లో ఒకటవుదాం అనే సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఈ చిత్రంతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత 786 (ఖేదీ ప్రేమ కథ), మోహిని వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇలా ఏడాది రెండు, మూడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే అనేక అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అధినేత, ప్రవరాఖ్యుడు, అహా నా పెళ్లంట, ఈగ, మిర్చి, రామయ్యా వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, రుద్రమదేవి, సోగ్గాడే చిన్ని నాయనా, బెంగాల్ టైగర్, శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో అతిథి పాత్రతో పాటు ప్రత్యేక పాటలకు డ్యాన్సులు చేసి మరింత క్రేజ్ సంపాధించింది. ఇక ఆ తర్వాత ఈమెకు క్యాన్సర్ సోకడంతో సినిమాలకు దూరం అయింది.
పూర్తిగా తన ఆరోగ్యం దృష్టి పెట్టిన ఈమె అనేక శస్త్ర చికిత్సలు, కోమోథెరఫీలు చేయించుకుని క్యాన్సర్ బారి నుంచి బయట పడింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్న ఈమె సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన అదిరిపోయే ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది.

అందులో కలర్ ఫుల్ డ్రెస్ వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. రంగురంగుల లెహంగాలో హంసా నందిని అందాలు అదిరిపోతుండగా.. నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలతో మమ్మల్ని హింస పెడుతున్నావు.. హంసా అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ నుంచి కోలుకుని 39 ఏళ్ల వయసులోనూ ఇంత అందంగా ఉన్నావంచే పదహారేళ్ల ప్రాయంలో ఇంకెంత అందంగా ఉండేదానివో అంటూ వివరిస్తున్నారు. మీరు కూడా ఓ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











