Krithi Shetty: మెరూన్ లెహంగాలో బేబమ్మ మెగా అందాలు.. 20 ఏళ్లకే ఇన్ని సొగసులా?

కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమాలో బేబమ్మగా నటించి తెలుగు సినీ ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది. తన అందాలతో పాటు అభినయాన్ని కూడా కనబర్చిన సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా 20 ఏళ్లకే అద్భుమైన అందాలు చూపించి అందరినీ ఫిదా చేసింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పెన సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పుడూ అభిమానులకు టచ్ లోనే ఉంటుందీ ముద్దుగుమ్మ.

Tollywood Cute Beauty Krithi Shetty Stunning Look Photos Goes Viral

ముఖ్యంగా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అందాలు ఆరబోస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో కృతి చాలా అందంగా కనిపిస్తోంది. మెరూన్ కలర్ లెహంగాలో ఈ బ్యూటీ మరింత అందంగా మెరిసిపోతోంది. కృతి ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే పది లక్షలకు పైగా లైకులు వచ్చాయి. వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి.

మెరూన్ కలర్ లెహంగా వేసుకున్న ఈమె .. స్లీవ్ లెస్ బ్లౌజును స్టైల్ చేసింది. అలాగే ఓ పెద్ద ఫింగర్ రింగ్ తో పాటు.. చిన్న తెలుపు రంగు పూసల చోకర్ వేసుకుంది. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని... చమక్కుమంటూ మెరిసిపోతుంది. వెనకాల రెడ్ కలర్ లైటింగ్ పెట్టి... కృతి శెట్టి అందాలు హైలెట్ అయ్యేలా ఫొటో షూట్ చేయించుకుంది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని చూసి తట్టుకోలేక పోతున్నామంటూ చెబుతున్నారు.

మెరూన్ లెహంగాలో చందమామలా మెరిసిపోతున్నావని కొందరు.. నీ క్యూట్ అండ్ హాట్ నెస్ తట్టుకోలేకపోతున్నామని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 20 ఏళ్లకే ఇంత అందం కల్గిన నువ్వు స్టార్ హీరోయిన్ గా మారి.. తెలుగు సినీ రంగాన్ని దున్నేయాలని కోరుకుంటున్నామంటూ ఆమె అభిమానులు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X