Laxmi Raai: 35 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల పడుచులా.. స్లీవ్‌లెస్ సింపుల్ డ్రెస్‌లో లక్కీ రాయ్ స్టన్నింగ్ షో!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమెకు ప్రస్తుతం 35 ఏళ్ల వయసు. కానీ ఈమె చూసేందుకు ఇప్పటికీ 16 ఏళ్ల పడుచు పిల్లలాగే కనిపిస్తోంది. చాలా క్యూట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ సింపుల్ ఫ్రాక్ వేసుకుని ఫోజులు పెట్టగా... ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన లక్ష్మీ రాయ్.. అతి తక్కువ కాలంలోనే అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది. నీకు నాకు, అధినాయకుడు, ఖైదీ నెంబర్ 150, వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మీ, సిండ్రెల్లా జనతా బార్ వంటి చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లోనూ నటించి మెప్పించింది. అవే ఆమెకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. రాయ్ లక్ష్మీ కెరియర్ ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తోంది. ఇన్నేళ్లలో ఆమె దాదాపు 60 సినిమాల్లో నటించింది.

సౌత్ తో పాటు నార్త్ లోనూ మెరిసింది. అనేక సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ను మాత్రం సొంతం చేసుకోలేక పోయిందీ ముద్దుగుమ్మ. కేవలం నటిగానే కాకుండా మోడల్ గా కూడా ఆమె రాణించి తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పలు సినిమాలు చేసిన ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ పొటోలతో పాటు పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేదికగా అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది.

అందులో ఈ ముద్దుగుమ్మ రెడ్ కలర్ సింపుల్ స్లీవ్ లెస్ ఫ్రాక్ వేసుకోగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సింపు ఫ్రాక్ పైకి లక్ష్మీ రాయ్.. పెద్ద పెద్ద జెర్మనీ సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. అలాగే హెయిర్ మొత్తాన్ని పోనీ టెయిల్ గా పెట్టుకుంది. చాలా క్యూట్ గా సాఫ్ట్ గా కనిపిస్తున్న ఈమె ఫొటోల్లో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అంతా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. 35 ఏళ్ల వయసులోనూ ఇంత క్యూట్ గా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఏమాత్రం మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











