Malavika Mohanan: నల్లని నెట్టెడ్ చీర కట్టుకుని నెట్టింట సెగలు పుట్టిస్తున్న మాళవిక.. మీరే చూడండి!
మాళవిక మోహనన్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషల సినిమాలు చూసే వారికి.. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈ ముద్దుగుమ్మ గురించి మరింత ఎక్కువగా తెలుస్తుంది. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా బ్లాక్ కలర్ నెట్టెడ్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.
29 ఏళ్ల వయసున్న ఈ ముద్దుగుమ్మ 2013లో మలయాళ సినిమా పట్టం పోల్ తో సినీ రంగంలో అడుగు పెట్టింది. మూడో సినిమా నాను మట్టు వరలక్ష్మి అంటూ కన్నడ చిత్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బియాండ్ ది క్లౌడ్స్ తో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. ఆరో సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోనూ కాలు మోపి.. మారన్ చిత్రంతో తెలుగులోనూ మెరిసింది. ఇలా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలు చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.

కేవలం నటిగానే కాకుండా మోడల్ గా కొనసాగుతున్న ఆ హాట్ బ్యూటీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన సినీ అప్ డేట్లతో పాటు తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరిస్తూ.. అధ్భుతమైన ఫోజులు పెడుతూ.. ఫొటోలు దిగుతుంటుంది. వాటిని నెట్టింట పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. అయితే తాజాగా మాళవిక మోహనన్ ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
అందులో ఆమె అదిరే అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది. ఓ బ్లాక్ కలర్ నెట్టెడ్ చీరను అందంగా కట్టుకుని.. అదిరే అందాలు ఆరబోసింది. ముఖ్యంగా నెట్టెట్ క్లాత్ కావడంతో.. ఆమె అందాలన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ చీర కావడంతో.. ఆమె మొహం అంతా తెగ మెరిసిపోతుంది. ధగా ధగా మెరిసిపోతున్న డైమండ్ లా కనిపిస్తున్న మాళవిక అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. మాళవిక ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటలోపే లక్షల్లో లైకులు, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి.
అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. చాలా మంది మాళవిక రోజురోజుకూ మరింత అందంగా తయారు అవుతున్నావు అంటూ చెప్పుకొస్తున్నారు. బ్లాక్ కలర్ చీరలో చందమామలా కనిపిస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ మాళవిక మోహనన్ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











