బైక్‌పై పడుకుని పరువాలు ఆరబోసిన పాతికేళ్ల బ్యూటీ.. ఈ యంగ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఈ మధ్య కాలంలో అనేక మంది అమ్మాయిలు హీరోయిన్లుగా మారుతూ.. అద్భుతైమైన సినిమాలు చేస్తున్నారు. అతిచిన్న వయసులోనే సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో కనిపిస్తూ కుర్రకారును కవ్విస్తున్నారు. తమ అందంతో పాటు అభినయాన్ని కనబరుస్తూ.. హాట్ ట్రీట్ ఇస్తున్నారు. అయితే తాజాగా పాతికేళ్ల ఓ యంగ్ హీరోయిన్ అదిరిపోయే అందాలు చూపించింది. ముఖ్యంగా బైక్ పై పడుకుని మరీ పరువాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ బ్యూటీ ఎవరు, ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం నటిగానే కాకుండా న్యాయవాదిగా కూడా కెరియర్ లో ముందుకు పోతున్న ఈ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు.. మాళవిక శర్మ. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె నటిగా, మోడల్ గా కొనసాగుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాలు చేసిన ఈమె... 2018లో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా 2018లో నేల టిక్కెట్టు అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెడ్ అనే సినిమాలోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది.

ఇక ఆ తర్వాత అంటే 2022లో కాఫీ విత్ కాదల్ అనే సినిమా కూడా చేసింది. గతేడాది కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమాలోనూ కనిపించి బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. అంతే కాదండోయ్.. ఇటీవలే గోపీ చంద్ హీరోగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన భీమా సినిమాలోనూ హీరోయిన్ గా మెరిసిందీ ముద్దుగుమ్మ. ఇలా ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు లాయర్ గా పని చేస్తుంది. ఇలా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న ఈమె.. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన అందమైన అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం 25 వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేసింది. ముఖ్యంగా బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకుని... బైక్ పై పడుకుని మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

మాళవిక శర్మ షేర్ చేసిన ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ కాగా... నెటిజెన్లు అంతా అమ్మడి అందాలకు ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, ఇంతందం ఏంటమ్మా తల్లి అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిన్ను చూసి తట్టుకోవడం కష్టం.. మరీ ఇలా బైక్ పై పడుకుని ఉంటే చూసి అస్సలే ఆగలేకపోతున్నామంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ముద్దుగుమ్మ మాళవిక శర్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











