46 ఏళ్ల వయసులో మంచుగారమ్మాయి మెస్మరైజింగ్ షో.. ఈ క్రేజీ లుక్ చూశారా?

టాలీవుడ్ టాప్ ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ మధ్య వీరి ఫ్యామిలీ మెంబర్స్ చేసే సినిమాలు ఎక్కువగా రావట్లేదు కానీ... గతంలో మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మిలు చాలానే సినిమాల్లో కనిపించి మెప్పించారు. అయితే మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసన్న హీరోయిన్ గా మారి మంచి మంచి సినిమాలే చేసింది. కానీ ఈ మధ్య మాత్రం సినిమాలు చేయట్లేదు. కానీ సోషల్ మీడియా వేధికగా తన అందచందాలు ఆరబోస్తూనే ఉంది. తాజాగా ఈమె ట్రెండీ లుక్ లో కనిపించి కుర్రకారును కవ్విస్తోంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం.

నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గారాల పట్టి అయిన లక్ష్మీ ప్రసన్న 2008లో ముందుగా ఓ ఇంగ్లీష్ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏడాది కూడా డెడ్ ఎయిర్ అనే హాలీవుడ్ చిత్రంలో కనిపించింది. ఇక ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2011లో ఇండియా వచ్చేసి తెలుగులో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలో విలన్ పాత్రలో నటించింది. ముక్యంగా ఐరేందిగా అద్భుతమైన టనన కనబర్చి తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా తొలి చిత్రంతోనే ఉత్తమ ప్రతినాయికగా నంది అవార్డు అందుకున్న ఈమె ఆ తర్వాత కూడా అనేక సినిమాలు చేసింది.

Tollywood Cute Beauty Manchu Laxmi Stunning Look Photos Goes Viral

ముఖ్యంగా దొంగల ముఠా, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, కడలి, గుండెల్లో గోదారి, బుడుగు, లక్ష్మీ బాంబ్, మా వింత గాధ వినుమా, పిట్ట కథలు సినిమాలు చేసింది. డిపార్ట్ మెంట్ అనే సినిమాతో హిందీ, మాన్ స్టర్ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోనూ కాలు మోపింది. అయితే గతేడాది మాత్రం ఎలాంటి చిత్రమూ చేయలేదు. ప్రస్తుతం ముంబైకి మకాం మార్చిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

అలాగే అప్పుడప్పుడు కొత్త కొత్త ఔట్ ఫిట్లలో దర్శనం ఇస్తూ.. వాటిని నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది. ఈఫొటోలు చూసిన కుర్రకారు వెర్రెత్తిపోతుంటారు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు 46 ఏళ్లు. కానీ చూసేందుకు మాత్రం పాతికేళ్ల అమ్మాయిలాగే కనిపిస్తుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఓ ట్రెండీ ఔట్ ఫిట్ ధరించి అద్భుతమైన ఫొటోషూట్ చేయింకుంది. వాటిని ఇన్ స్టాలో పెట్టగా పెద్ద ఎత్తునే లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

Tollywood Cute Beauty Manchu Laxmi Stunning Look Photos Goes Viral

పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ కు పైన స్కై బ్లూ అండ్ యాష్ కలర్ డిజైన్ టాప్ వేసుకుంది. ఈ డ్రెస్ లో మంచు లక్ష్మీ అందాలు అదిరిపోయాయనే చెప్పొచ్చు. ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈమె.. మెస్మరైజింగ్ షోకు కుర్రకారంతా ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫొటోలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X