46 ఏళ్ల వయసులోనూ నునులేత అందాలు.. నయా లుక్‌లో మంచుగారమ్మాయిని చూశారా?

నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గురించి ఆయన కుటుంబ సభ్యుల గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈయన గారాల పట్టి మంచు లక్ష్మీ ప్రసన్న గురించి అయితే తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందాలు, నటన, టాకింగ్ స్టైల్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా ట్రెండీ వేర్ ధరించి దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె అందాలు ఆరబోయగా.. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మంచు ఫ్యామిలీ ఒక్కగానొక్క కూతురు అయిన ఈమె.. ముందుగా తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో సినిమాలు చేసింది. అమెరికాలోనే చాలా కాలం ఉన్న ఈమె.. అక్కడే ద ఒడే అనే సినిమా ద్వారా 2008లో సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత డెడ్ ఎయిర్ అనే మరో సినిమా కూడా చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు ఇండియా వచ్చి అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలో ఐరేందిగా (విలన్) నటించి అదరగొట్టింది. తన అందాలతో పాటు యాక్టింగ్ టాలెంట్ ను కూడా చూపించి అందరినీ మెస్మరైజ్ చేసింది.

Tollywood Cute Beauty Manchu Laxmi Trendy look Photos Goes Viral

ఆ తర్వాత దొంగల ముఠా, ఊ కొడతారా ఉలిక్కిపడతారా, కడలి, గుండెల్లో గోదారి, బుడుగు, లక్షఅమీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, మా వింత గాధ వినుమా, పిట్ట కథలు, మాన్ స్టర్ వంటి చిత్రాలు చేసింది. ఏడాదికో సినిమాతో వస్తూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.

ముఖ్యంగా ఎల్లో కలర్ ట్రెండీ వేర్ లో కనిపించి అందాలను ఆరబోసింది. స్లీవ్ లెస్, డీప్ నెక్ బ్లౌజ్ వేసుకున్న లక్ష్మీ కింద ఓ ప్యాంట్ వేసుకుంది. అలాగే పైనుంచి ఓ సన్నని కోట్ ను వేసుకుని జర్మన్ సిల్వర్ ఇయర్ రింగ్స్, ముక్కుపుడుకతో చాలా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. పద్ధతిగా కనిపిస్తూనే చాలా హాట్ లుక్స్ పెట్టి రచ్చ చేస్తోంది. ప్రస్తుతం 46 ఏళ్ల వయసు కల్గిన ఈమె తన అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు.

Tollywood Cute Beauty Manchu Laxmi Trendy look Photos Goes Viral

మంచు లక్ష్మీ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వస్తున్నాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, యమా హాట్ గా ఉన్నావు మంచక్కా...అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి మంచు లక్ష్మీ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X