Nidhhi Agerwal: 30 ఏళ్ల అందాల "నిధి".. చీర కడితే కుర్రాళ్లకు చిత్రవధే!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ 2017లో మున్నా మైకేల్ అనే హిందీ చిత్రం బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాది సవ్యసాచి సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ కాలు మోపి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందాలు ఆరబోసింది. ముఖ్యంగా చీర కట్టి స్టన్నింగ్ షో చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2018లో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన నిధి అగర్వాల్.. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇక్క, ఇస్మార్ట్ శంకర్, మాస్క్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె.. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న హరిహర వీరమల్ల చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటు తెలుగు అటు హిందీ సినిమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Tollywood Cute Beauty Nidhhi Agerwal Stunning Look Photos Goes Viral

తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సామాజిక మాధ్యమాల వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో లైట్ స్కై బ్లూ కలర్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ముఖ్యంగా మిలమిలా మెరిసే చీరలో ఈ ముద్దుగుమ్మ ముత్యంలా మెరిసిపోతుంది. ఈ చీరలో నిధిని ఎవరు చూసినా... 30 అందాల నిధి అని చెప్పడం ఖాయం.

ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు షేర్లతో తెగ రచ్చ చేస్తున్నారు. మల్లెపూవు కన్నా అందంగా ఉన్నావని కొందరు, నీ అందం చూస్తుంటే తట్టుకోలేక పోతున్నామని మరికొందరు చెప్పుకొస్తున్నారు. నువ్వు తెలుగులో చాలా చిత్రాల్లో ఛాన్సులు కొట్టేయాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నామంటూ మరికొంత మంది అభిమానులు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాద్ లోనే అయినా ఆమెకు తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ భాషలు కూడా వచ్చు. ప్రస్తుతానికి ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది. కానీ ముందు ముందు తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ అందాల ముద్దుగుమ్మ ఎలాంటి చిత్రాల్లో నటించి, ఎంతటి స్థాయికి ఎదుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X