Nidhi Agerwal: 30 ఏళ్ల వయసులో అందాల "నిధి" ఎలా ఉందో చూస్తారా..?

నిధి అగర్వాల్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయం కలగలిపిన ఈమె.. హైదరాబాద్ లోనే పుట్టింది. 2017లో మున్నా మైకేల్ అనే హిందీ చిత్రం బాలీవుడ్ లో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా పలు చిత్రాలు చేస్తూ వస్తున్న ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియా వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ కాలు మోపిందీ క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇక్క అనే హిందీ సినిమా, తెలుగులో ఇస్మార్ట్ శంకర్, మాస్క్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె.. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న హరిహర వీరమల్ల చిత్రంలో అలకాశం అందిపుచ్చుకుంది. చేసింది తక్కువ చిత్రాలే అయినా బానే క్రేజ్ సంపాధించుకుంది.

Tollywood Cute Beauty Nidhi Agerwal Stunning Bikini Look Photos Goes Viral

ప్రస్తుతం 30 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇటు తెలుగుతో పాటు అటు హిందీ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. కేవలం సినిమాలు చేస్తూ బిజీగా గడపడమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. అంతే కాకుండా తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సామాజిక మాధ్యమాల వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో వైట్ కలర్ డ్రెస్ వేసుకుని మల్లెపూవులా మెరిసిపయింది. తన అద్భుతమైన అందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్యూట్ బ్యూటీ హాట్ ఫొటోలను చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. బాడీ మొత్తం పట్టేసినట్లు ఉన్న ఈ లాంగ్ డ్రెస్ లో నిధి అగర్వాల్.. బాడీ షేపులన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ వయ్యారాలు చూస్తే కుర్రకారు మతిపోవడం ఖాయం.

వైట్ అండ్ డీప్ నెక్ ఉన్న ఈ డ్రెస్ కు.. హెయిల్ లీవ్ చేసుకుని.. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని చాలా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. కూర్చుని, నిల్చుని అదిరిపోయే ఫోజులు పెడుతూ.. అందరినీ ఆగం చేస్తోంది. నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు అంతా... పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు షేర్లతో తెగ రచ్చ చేస్తున్నారు. మల్లెపూవులూ మెరిసిపోతున్నావని కొందరు, నీ అందం చూస్తుంటే తట్టుకోలేక పోతున్నామని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాద్ లోనే అయినా ఆమెకు తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ భాషలు కూడా వచ్చు. ప్రస్తుతానికి ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది. కానీ ముందు ముందు తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ అందాల ముద్దుగుమ్మ ఎలాంటి చిత్రాల్లో నటించి, ఎంతటి స్థాయికి ఎదుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X