Pooja Hegde: స్లీవ్‌లెస్ డ్రెస్‌లో పొడుగు కాళ్ల సుందరి ప్రత్యేక ఫోజులు.. యాపిల్ పండ్ల బుట్టలతో యమా క్రేజీగా!

పూజా హెగ్డే... ఈ పేరు తెలియని భారతీయులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. అలా అనేక అదిరిపోయే చిత్రాలు చేసిన ఈమె తాజాగా అంతకు మించిన గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ఈ పొడుగు కాళ్ల సుందరి పొట్టి డ్రెస్ వేసుకుని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మాస్క్ అనే తమిళ సినిమాతో 2012లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ... ఒక లైలా కోసం చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ముకుంద, డీజే, రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. కానీ ఆ తర్వాత నుంచి ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ లుగా నిలిచాయి. తెలుగులో వరుసగా రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. అలాగే హిందీలో సర్కస్, రాధేశ్యామ్, తమిళ్ బీస్ట్ కూడా ఆడలేదు.

Tollywood Cute Beauty Pooja Hegde Stunning Look Photos Goes Viral

దీంతో ఈ అమ్మడు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. ఏదైనా మంచి చిత్రంతో హిట్టు కొట్టాలని భావిస్తోంది. అయితే ఆమె ప్లాప్ చిత్రాలతో సంబంధం లేకుండా.. అవకాశాలు వస్తున్నాయి. ఇలా ఓవైపు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తునే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందాలను ఆరబోస్తుంది. ఇలా తన గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూనే సినిమా అవకాశాలు అందిపుచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.

అయితే పూజా హెడ్గే ఓ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. స్కై బ్లూ కలర్ పొట్టి డ్రెస్ లో ఈ పొడుగు కాళ్ల సుందరి యమా క్రేజీగా కనిపిస్తోంది. ముఖ్యంగా యాపిల్ పండ్ల బుట్టల పెట్టిన ఓ ఎల్లో కలర్ జీపులో కూర్చుని.. ఈ ఫొటో దిగింది. అందులో ఈ బుట్టబొమ్మ అందాలు నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ చాలా అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలను అస్సలే తట్టుకోలేకపోతున్నామని కొందరు, సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా మమ్మల్ని అలరించడం చాలా సంతోషంగా అనిపిస్తుందంటూ చెప్పుకొస్తున్నారు.

అలాగే నువ్వు మంచి సినిమాలతో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నామంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. తెలుగులోను నువ్వు మంచి సినిమాలు చేస్తే చూడాలని చాలా ఉందంటూ చెప్పుకొస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X