Priyamani: కొప్పున పూలు.. చంకీల కోక.. కేక పుట్టిస్తున్న ప్రియమణి కొత్తందాలు చూశారా?

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియమణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె ఇప్పిటకీ సినీ రంగంలో కొనసాగుతున్నారు. కానీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నప్పటికీ.. హీరోయిన్ గా మాత్రం ఎంట్రీ ఇవ్వట్లేదు. అయినప్పటికీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చంకీల కోక కట్టి.. కొప్పున పూలు పెట్టింది. అదిరిపోయే అందాలు కనిపించేలా ముస్తాబై ఫొటోషూట్ చేయించుకుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన ఆ ఫొటోల విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2003లో ఎవరే అతడాగు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది హీరోయిన్ ప్రియమణి. ఆ తర్వాత తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీల్లోనూ కాలు మోపి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా అన్ని ఇండస్ట్రల్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ అనేక సినిమాలు చేసింది. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. కేవలం సినిమాలే కాకుండా టీవీలో పలు షోలు చేసుకుంటూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పిస్తోంది.

Tollywood Cute Beauty Priyamani Stunning Look Photos Goes Viral

అద్భుతమైన అందాలతో పాటు అంతకు మించిన టాలెంట్ కల్గిన ఈ ముద్దుగుమ్మ ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే కొత్త కొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ... కవ్వించే ఫోజులు పెడుతూ ఫోటో షూట్ లు కూడా చేయించుకుంటుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే చంకీల చీర కట్టిన ఈ క్యూట్ బ్యూటీ.. కొప్పున పూలు కూడా పెట్టింది. ముఖ్యంగా చామంతి పూలు కొప్పున చుట్టి స్లీవ్ లెస్ బ్లౌజులో సోకులు ఆరబోసింది. ముఖ్యంగా లైట్ మేకప్ తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. ప్రియమణి షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ కామెంట్లు, లైకులు, షేర్లతో రచ్చ చేస్తున్నారు.

ప్రస్తుతం 29 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ అందాలకు అంతా ఫిదా అయిపోయితున్నారు. ఇంత చిన్న వయసులోనే చాలా పెద్దదానిలా మెచ్యూర్డ్ గా కనిపించడం నీకెలా సాధ్యం అయిందంటూ చాలా మంది కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. చీరలో కొత్తందాలు చూపించిన ప్రియమణి ఫొటోలకు లైకులు రూపంలో తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X