48 ఏళ్ల వయసులోనూ మిర్చికంటే ఘాటుగా మత్స్యకన్య.. ఎవరో గుర్తు పట్టారా?

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ శిల్పా శెట్టిగా కంటే కూడా సాగరకన్యగానే ఎక్కువగా తెలుసు. ఎందుకుంటే ఈ క్యూట్ బ్యూటీ సాహస వీరుడు సాగర కన్య సినిమాలో.. సాగర కన్యగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. అయితే ఒకప్పుడు కుర్రాళ్ల కళల రాణిగా ఉర్రూతలూగించిన ఈమె మరోసారి అదే అందంతో కనిపించి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా 48 ఏళ్ల వయసులోనూ మిర్చికంటే ఘాటుగా కనిపించి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1993లో బాజీగర్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది శిల్పాశెట్టి. తొలి చిత్రంలోనే తన అందం, అభినయాన్ని కనబర్చి అందరి మనసులు కొల్లగొట్టింది. ఆతర్వాత నుంచి వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా కెరియర్ ప్రారంభంలో ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ అండ్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

Tollywood Cute Beauty Shilpa Shetty Stunning Look Photos Goes Viral

కేవలం హిందీలోనే కాకుండా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. 2010 వరకు ఎన్నెన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె 2009లో బిజినెస్ మాన్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. ఇక పెళ్లి తర్వాత నుంచి ఇద్దరు పిల్లలకు జన్మను ఇచ్చిన ఈమె మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ మళ్లీ ఆ తర్వాత అదిరిపోయే సినిమాలు చేస్తూ వస్తోంది. ఓవైపు తల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. సినిమాలు చేస్తూ పోతుంది.

సినిమాల్లో, కుటుంబ బాధ్యలలతో ఎంత బీజాగా ఉన్నా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించి కవ్విస్తోంది.

Tollywood Cute Beauty Shilpa Shetty Stunning Look Photos Goes Viral

రెడ్ కలర్ డ్రెస్ లో లాంగ్ ఫ్రాక్ వేసుకున్న శిల్పా మిర్చికంటే ఘాటుగా కనిపిస్తోంది. పోజెస్ ఆర్ రోజెస్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన ఈమె సింపుల్ డైమండ్ చోకర్, రింగ్స్, బ్రేస్ లెట్ ధరించింది. హెయిర్ లీవ్ చేసుకుని మరీ వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం శిల్పా శెట్టి షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు, నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులోనే ఇలా ఉన్నావంటే పదహారేళ్ల వయసులో ఇంకెలా ఉన్నావో అంటూ చెప్పుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X