Shraddha Rama Srinath: మంచు కొండల్లో జెర్సీ బ్యూటీ.. మస్త్ మస్త్ అందాలతో మరింత ఊరించేలా!
శ్రద్ధా రామ శ్రీనాథ్.. శ్రద్ధా శ్రీనాథ్.. ఈ క్యూట్ బ్యూటీ గురించి తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె జెర్సీ సినిమాలో నాని భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. తాజాగా అదిరిపోయే ఔట్ ఫిట్ ధరించి వయ్యారాలు ఒలకబోసింది. ముఖ్యంగా మంచుకొండల్లో మస్త్ మస్త్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మోడల్ గా కెరియర్ ప్రారంభించిన శ్రద్ధా శ్రీరామ నాథ్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ముఖ్యంగా 2015లో కోహినూర్ అనే సినిమాతో మలయాళ సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడలో యూ టర్న్, ముంగారు మేల్ 2, ఉర్వి అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కాట్రు వెళియిదై, ఇవన్ తంతిరాన్, వికమ్ వేద, రిచి వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత మిలన్ టాకీస్ అనే సినిమాతో హిందీలోనూ ఓ సినిమా చేసింది. అలా అన్ని భాషల్లో చిత్రాలు చేస్తూ వస్తున్న ఈమె.. జెర్సీ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది.

ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా, ఇటీవలే సైంధవ్ చిత్రంలోనూ కనిపించి మెప్పించిందీ కుర్ర హీరోయిన్. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తున్న ఈమె అనేక అవార్డులు దక్కించుకుంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుని తన లాటెంల్ ప్రూవ్ చేసుకుంది. ఇలా ప్రస్తుతం అనేక సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా వివరిస్తుంటుంది.
అంతేకాదండోయ్.. అద్భుతమైన ఔట్ ఫిట్లు ధరిస్తూ.. అదిరే ఫోజులతో ఫొటోలు దిగుతుంది. వాటిని నెట్టింట పెడుతూ.. కుర్రకారు హాట్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ జమ్ము కశ్మీర్ వెళ్లింది. అక్కడే మంచు కొండల్లో మస్త్ మస్త్ ఫొటోలు దిగింది. అదిరిపోయే జీన్స్ లో స్వెటర్ వేసుకుని మరీ స్పెషల్ గా ఫోజులు పెడుతూ.. ఫొటోలు దిగింది. స్టైలిష్ లుక్ లో సర్ ప్రైజ్ చేస్తూ... తన సోకులను చూపించింది. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. శ్రద్ధా ఎంత శ్రద్ధగా అందాలు ఆరబోశావు అంటూ చెప్పుకొస్తున్నారు. నిన్ను చూస్తే తట్టుకోలేకపోతున్నామని.. నీ అందాలు, ఫొటోలు అదిరిపోయాయంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ జా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











