పాము పొర దుస్తుల్లో పరువాలు ఆరబోసిన 41 ఏళ్ల బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా?

ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరూ అందంపై చాలా ఫోకస్ చేస్తున్నారు. పది మందిలో అందంగా కనిపించేందుకు ఎంత డబ్బులు అయినా ఖర్చు పెడుతూ రచ్చ చేస్తున్నారు. సామాన్య ప్రజలే తమ అందాలను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఇక సినిమా వాళ్లు ఏ రేంజ్ లో కేర్ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 40 ఏళ్ల పైబడిన వారు కూడా పాతికేళ్ల పడుచుల్లా కనిపించాలని.. రోజూ జిమ్ చేస్తూ, చక్కటి డైట్ ఫాలో అవుతూ తమ ఫిగర్ ను కాపాడుకుంటున్నారు. అలాంటి వాళ్లలో ఒకరే శ్రీయా శరణ్. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కనిపిస్తున్న రచ్చ చేస్తున్న ఈమె తాజాగా పాము పొర దుస్తులు వేసుకుని రచ్చ చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇష్టం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రియా శరణ్ గురించి.. ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందంతో అంతకు మించిన టాలెంట్ తో ఎప్పటికప్పుడు వరుసగా అవకాశాలు దక్కించుకున్న ఈమె ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని తన అందంతో ఓ ఊపు ఊపిన ఈమె 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో రాణిస్తూనే ఉంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ బ్యూటీ.

Tollywood Cute Beauty Shriya Saran Sizzling Look Photos Goes Viral

23 ఏళ్ల క్రితం సినీ రంగంలో కాలు మోపిన ఈ క్యూట్ బ్యూటీ.. అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కనిపిస్తూ కుర్రకారును ఆగం చేస్తోంది. ముఖ్యంగా స్పెషల్ ఫుడ్, డైట్ తీసుకుంటూ అదే ఫిజిక్ ను కాపాడుకుంటోంది. నాలుగేళ్ల క్రితమే శ్రీయ.. ఓ బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. తల్లిగా మారాక కూడా ఈ ముద్దుగుమ్మ అందాలు ఏమాత్రం తగ్గలేదు. అయితే పాప పుట్టిన తర్వాత కబ్జా సినిమా చేసిన ఈ బ్యూటీ.. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Tollywood Cute Beauty Shriya Saran Sizzling Look Photos Goes Viral

ఎప్పటికప్పుడు తన అందమైన అదిరిపోయే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. అందులో పాము పొర వంటి పొడవాటి స్ట్రెయిట్ కట్ డ్రెస్ వేసుకుంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో ఓ కాలు పైకెత్తి మరీ అందాలు ఆరబోసింది. ప్రస్తుతం శ్రియా షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

బ్లాక్, చంకీలు, సీ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ లో శ్రియా మెరిసిపోతుంది. డ్రెస్ అంతా డల్ గా కనిపిస్తుండగా.. ఆమె అందాలన్నీ హైలెట్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. 41 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల పడుచులూ.. చాలా హాట్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X