Shriya Saran: 41 ఏళ్ల వయసులో శ్రీయ సరన్ అందాల సోయగాలు.. చీరకట్టులో కనికట్టు చేస్తున్న బ్యూటీ క్వీన్

ఈ మధ్య కాలంలో ఎవరిని చూసిన వారు వయసును అంచనా వేయడం కష్టంగానే మారింది. అందరూ అందంపై ఆసక్తి పెంచుకుని.. వయసు తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లు అయితే మరింతగా తమ అందాలను కాపాడుకుంటూ వస్తున్నారు. నాలుగు పదులు, ఐదు పదుల వయసులోకి వచ్చినా... పదహారేళ్లు, పాతికేళ్ల వయసును మించి కనిపించట్లేదు. ఇలా తమ అందాలను కాపాడుకుంటూ అదిరిపోయే గ్లామర్ షో చేస్తున్న వాళ్లలో చాలా మందే ఉండగా.. ఓ సీనియర్ టాలీవుడ్ బ్యూటీ.. గ్లామర్ షోతో రచ్చ చేసింది. ఆమె ఎవరు, ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇష్టం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రియా శరణ్ గురించి.. ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందంతో అంతకు మించిన టాలెంట్ తో ఎప్పటికప్పుడు వరుసగా అవకాశాలు దక్కించుకున్న ఈమె ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని తన అందంతో ఓ ఊపు ఊపిన ఈమె 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో రాణిస్తూనే ఉంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ బ్యూటీ.

Tollywood Cute Beauty Shriya Saran Stunning Look Photos Goes Viral

సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తూ... కుర్రకారును మాయ చేస్తోంది. ముఖ్యంగా అదే ఫిజిక్ ను మెయింటేన్ చేస్తున్న ఈమె నాలుగేళ్ల క్రితమే ఓ బిడ్డకు జన్మను ఇచ్చింది. తల్లిగా మారాక కూడా ఈ ముద్దుగుమ్మ అందాలు ఏమాత్రం తగ్గలేదు. అయితే పాప పుట్టిన తర్వాత కబ్జా సినిమా చేసిన ఈ బ్యూటీ.. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పిటక్పుపుడు తన అందమైన అదిరిపోయే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ నెట్టెడ్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకుని.. ఓ నెక్లెస్ పెట్టుకున్న ఈమె చేతికి వైట్ కలర్ బ్యాంగిల్ కూడా వేసుకుని అందంగా ముస్తాబైంది.

హెయిర్ లీవ్ చేసి క్యూట్ గా నవ్వుతూ కుర్రకాను తన చూపుతోనే కట్టి పడేస్తోందీ క్యూట్ బ్యూటీ. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా 41 ఏళ్ల వయసులోనూ ఇంద గ్లామరస్ గా కనిపిస్తున్నావేంటి అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X