Shriya Saran: వైట్ కలర్ శారీలో శ్రియా వయ్యారాలు.. 41 ఏళ్ల వయసులోనూ నాటీగా!
ఇష్టం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రియా శరణ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభియనంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలు దక్కించుకొని టాప్ హీరోయిన్ గా మారిపోయింది. 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో రాణిస్తూనే ఉంది. కెరియర్ ప్రారంభించినప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉండి కుర్రకారును తెగ అలరిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ శారీ కట్టుకుని తెగ వయ్యారాలు పోయింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
23 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రియా సరణ్.. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. సినీ రంగంలో అడుగు పెట్టినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా శ్రియ అదే ఫిజిక్ మెయింటెయిన్ చేస్తుంది. అయితే మూడేళ్ల కింద తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో అంటే 2020 శ్రియ ఓ పాపకు జన్మనిచ్చింది. ఆమెకు రాధ అనే పేరును కూడా పెట్టుకుంది. పాప పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తెగ సందడి చేస్తుంది.

గతేడాగగి కబ్జా సినిమాలో నటించి మప్పించిన ఈ ముద్దుగుమ్మ... ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేధికగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూనే.. తన పర్సనల్ లైఫ్ కు, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో శ్రియా చాలా అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైట్ కలర్ శారీ కట్టుకుని వయ్యారాలు పోయింది.
డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ శారీలో చాలా అందంగా కనిపిస్తుంది. శ్రియా ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా చాలా హాట్ గా కనిపిస్తున్నావంటూ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తున్నావంటూ ఓ నెటిజెన్ చెప్పగా.. ఐ లవ్ యూ హాట్ బ్యూటీ అంటూ మరో యువకుడు చెప్పుకొచ్చాడు. నిన్ను నీ అందాలను తట్టుకోవడం చాలా కష్టం అంటూ వివరిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











