Sreeleela: "అది లేకపోయినా పర్లేదు... అలాంటి వాడే భర్తగా కావాలి"
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా డాక్టర్ అయిన ఈమె.. సినిమాల మీద ఇష్టంతో హీరోయిన్ గా మారిపోయింది. అతి చిన్న వయసులోనే అందరి మనసు దోచిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. అది లేకపోయినా పర్లేదు కానీ... అలాంటి గుణాలు ఉన్నవాడే తన భర్తగా కావాలనుకుంటున్నట్లు తెలిపింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2019లో కిస్, భరతే అనే కన్నడ సినిమాలతో సిన రంగంలో అడుగు పెట్టిన శ్రీలీలీ... 2021లో పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయాన్ని చూపించి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ తర్వాత రెండు కన్నడ సినిమాలు చేసిన ఈమె.. ఇక వరుసగా తెలుగు సినమాలే చేస్తూ రచ్చ చేస్తుంది. ముఖ్యంగా ఏడాదికి నాలుగైదు సినిమాలు.. అందులోనూ టాప్ హీరోల సరసన నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది.

తన అందం, అభినయంతో కుర్రకారు గండెల్లో తిష్ట వేసుకొని కూర్చున్న ఈమె.. కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా డ్యాన్స్ కూడా ఇరగదీస్తూ.. అద్భుతమైన అవకాశాలను అంది పుచ్చుకుంటోంది. కుర్రకారు హాట్ ఫేవరెట్ అయిన ఈ క్యూట్ బ్యూటీ ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఆమె.. పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండలతో కూడా నటించనుంది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే అనేక విషయాలు చెబుతూ తన సీక్రెట్ లను వివరించింది. ముఖ్యంగా మమ్మీకి తెలియకుండా చాలా నాటీ పనులు చేసినట్లు వెల్లడించింది. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు తన అమ్మను ఓ ఆట ఆడుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే తన రైటింగ్ గురించి చెబుతూ.. ఎల్ అండ్ డుర్.. అలాగే రాస్తాను డాక్టర్ ను కదా అంటూ కామెడీ చేసింది. అలాగే యాంకర్ పెళ్లి గురించి అడగగానే చాలా సిగ్గుపడిపోయింది.

తనకు ఎవరూ ప్రపోజ్ చేయలేదని.. తన వద్ద అమ్మమ్మ వైబ్ ఉంటుందని చాలా మంది చెబుతారని శ్రీలీల వెల్లడించింది. అలాగే తాను కోప్పడితే అంతా నవ్వుతారని పేర్కొంది. ఇప్పటి వరకు నాతో ఎవరూ సింక్ అవలేరని.. ఎందుకో నాక్కూడా తెలియని చెప్పింది. ఈక్రమంలోనే నీకు ఫన్నీ అండ్ జోవియల్ గా ఉండే వాడు భర్తగా కావాలా.. బ్రెయినీ గాయ్ కావాలా అని యాంకర్ అడగ్గా.. టక్కుమని ఫన్నీ అండ్ జోవియల్ గాయ్ కావాలని చెప్పింది. బ్రెయిన్ వాడినా వాడకపోయినా.. పన్నీగా ఉండే వాళ్లతో హ్యాపీగా, హాయిగా ఉండొచ్చని శ్రీలీల చెప్పుకొచ్చింది. అలాంటి వాడే తన భర్త అయితే బాగుంటుందని వివరించింది.


Click it and Unblock the Notifications











