వయసేమో 42.. అందాలు మాత్రం 16.. మోడ్రన్ లుక్‌లో మెరిసిపోతున్న బ్యూటీని గుర్తు పట్టారా?
సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్ల మొహాలు చూసి వయసు చెప్పడం చాలా కష్టం. 40, 50 ల వయసులోకి వచ్చినా వారింకా పడుచు పిల్లల్లాగే కనిపిస్తుంటారు. ముందే తెలిస్తే తప్ప అసలు గుర్తించలేము. ఇప్పుడు మనం చూస్తున్న బ్యూటీ కూడా అలాంటి అమ్మాయే. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కల్గిన ఆ ముద్దుగుమ్మ అందాలు చూస్తే పదహారేళ్ల పడుచు పిల్లే అనుకుంటాం. అంత అందంగా కనిపిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ ఎవరు పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విమలా రామన్... ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ 2006లో పోయి సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది. తొలి చిత్రంతోనే తన అందం, అభినయం కనబర్చిన ఈమె ఆ తర్వాత ఏడాది మలయాళంలో టైం అనే సినిమా చేసి మెప్పించింది. ఇక ఆ తర్వాత నుంచి సంవత్సరానికి 3, 4 సినిమాలు చేస్తూ తెలుగు, మలయాళ భాషల్లో రచ్చ చేసింది. ముఖ్యంగా తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా చేసిన ఎవరైనా ఎపుడైనా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో కూడా తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జగపతి బాబు హీరోగా చేసిన గాయం 2తో పాటు రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేకంటేశాయ, రుద్రంగి, గాండీవదారి అర్జున వంటి చిత్రాల్లో నటించింది. ఇలా అనేక సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.
ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అందమైన క్రేజీ క్రేజీ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. ముఖ్యంగా పింక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది.

పిక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోసింది. అలాగే మెడలో అదిరిపోయే ఓ నెక్లెస్ వేసుకున్న ఈమె చాలా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ సూపర్ ట్రెడీషినల్ లుక్ లో ఉమెన్స్ డే సందర్భంగా ఫొటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











