బాలీవుడ్ హాట్ బ్యూటీపై సమంత ప్రశంసలు.. అసలు కథేంటీ?
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా వారం రోజులుగా తన ప్రమేయం లేకుండా వార్తల్లో నిలుస్తోంది. తనను అడ్డం పెట్టుకుని అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు పొలిటికల్ లీడర్స్. తాజాగా స్టార్ హీరోయిన సమంత ఇన్‌స్టా వేదికగా ఓ బాలీవుడ్ హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ బాలీవుడ్ హ్యాట్ బ్యూటీ ఎవరు? ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటీ? మీరు కూడా ఓ లూక్కేయండి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ అమ్మడు. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో హై పాపులర్టీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తన తొలి హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు పెద్దలను ఒప్పించి.. మూడు మూళ్ల బంధం కోసం ఒక్కటయ్యారు. కానీ, ఇరువుల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని ప్రస్తుతం తమ జీవితం తాము కడుపుతున్నారు.

ఇక విడాకుల తర్వాత సామ్ మయోసైటీస్ (Myositis)అనే వ్యాధి బారినపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఆరోగ్యంపై పుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్లలో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది సమంత.ఇదిలా ఉంటే.. తాజాగా సమంత ఇన్‌స్టా వేదికగా ఓ బాలీవుడ్ హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ బాలీవుడ్ హ్యాట్ బ్యూటీ ఎవరు?
ఆ అమ్మడు ఎవరో కాదు. అనన్య పాండే. ప్రముఖ బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే పై హీరోయిన్ సమంత ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన సీటీఆర్ఎల్ మూవీలో అనన్య పాండే అద్భుతంగా నటించిందనీ, తన నటనతో తనని ఆకట్టుకుందని సోషల్ మీడియా వేదికగా సమంత ప్రశంసలు కురిపించింది. అలాగే.. సీటీఆర్ఎల్ మూవీని తప్పకుండా చూడాలనీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకొచ్చింది సమంత. అనన్య పాండే నటన తనని చాలా బాగుందనీ, అలాగే.. ఈ సినిమా చూసిన వెంటనే తన ఫోన్ లో చాలా యాప్స్ ను అన్ఇన్స్టాల్ చేశానని రాసుకొచ్చారు స్టార్ హీరోయిన్ సమంత.

ఇకపోతే బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లైగర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో బాలీవుడే పరిమితమైంది. ఇప్పటిదాకా అనన్య నటించిన సినిమాలు చెప్పుకోతగ్గ విధంగా విజయం సాధించకున్నా.. ఈ బ్యూటీకి గుర్తింపు కాకున్నా.. ఈ అమ్మడు తన అందాల ప్రదర్శనతో బాలీవుడ్‌లో నెట్టుకురాగలుగుతోంది.
అటు బాలీవుడ్ చిత్రాలు, హాట్ వెబ్ సీరిస్ లతో ఈ అమ్మడు బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన 'కాల్ మీ బె, కంట్రోల్'మూవీలతో పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా సిటిఆర్ఎల్ మూవీలో నటించింది. ఈ మూవీకి విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించగా.. ఈ మూవీ అక్టోబర్ 4 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో విహాన్ సమత్ లీడ్ రోల్ నటించారు. అంతకుముందు అనన్య పాండే తో కలిసి కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ లో కూడా వీరిద్దరూ యాక్ట్ చేయడం విశేషం. వాస్తవానికి ఈ అమ్మడుకు సరైన హిట్ దొరకకపోవడంతో ఫెయిల్యూర్ హీరోయిన్ అనే విమర్శిస్తున్నారు. నేడు పాన్ ఇండియా హీరోయిన్ సమంత.. ఈ ఫెయిల్యూర్ హీరోయిన్ అనన్య పాండేపై ప్రశంసలు కురిపించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.


Click it and Unblock the Notifications











