Samantha: అలా రాత్రి పక్కపైకి చేరడమే అసలు మజా.. సమంత వీడియో వైరల్
Samantha: బ్యూటిపుల్ హీరోయిన్ సమంత గురించి సుపరిచితమే. ఈ అమ్మడుకు కోట్లలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో లైక్‌లు, కామెంట్లతో సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది. ఏమాయ చేశావే చిత్రంతో సామ్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీనే మంచి టాక్ రావడంతో దర్శక, నిర్మాతలు ఈ అమ్మడుకు వరుస అవకాశాలు ఇచ్చారు. దీంతో ఈ బ్యూటీ అతితక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి అగ్రహీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ క్రమంలోనే అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది.
సమంత-నాగచైతన్య కొన్నాళ్లపాటు ప్రేమలో ఉండి.. పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. కానీ వీరి బంధం కలకాలం నిలవలేకపోయింది. అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి ఫ్యాన్స్‌కు భారీ షాక్ ఇచ్చారు. దీంతో ఈ కపుల్ అభిమానులంతా నిరాశ చెందారు. విడిపోవద్దని సోషల్ మీడియా వేదికన కామెంట్లు చేశారు. కొంతమంది సామ్‌కు సపోర్ట్ చేసి మాట్లాడగా.. మరికొంతమంది చైతన్యకు మద్ధతుగా మాట్లాడారు. తప్పేవరిదో తెలియనప్పటికీ ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు.

ప్రస్తుతం సామ్ సింగిల్‌గానే ఉంది. ఇటీవల నాగచైతన్య తోటి శోభితతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నారంటూ నెట్టింట టాక్ వినిపించింది. ఇప్పటికీ కూడా వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇకపోతే సామ్ మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తోంది వెబ్ సిరీస్‌లు, మూవీస్, హెల్త్ పాడ్ కాస్ట్‌లు చేస్తూ సామ్ బిజీ అయిపోయింది.
తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసి.. తను రోజు చేచే పనుల గురించి చెప్పుకొచ్చింది. 'మార్నింగ్ 6.30 గంటలకు కొంచెం సేపు సూర్యరష్మీ కోసం బయట నిల్చుంటుంది. తర్వాత ఆయిల్ పుల్లింగ్, హెయిర్ మసాజ్ చేయించుకుంటుంది. 7 గంటలకు వర్కౌట్స్ చేస్తుంది. అనంతరం దేవుడకి పూజ చేసి.. వర్క్ కోసం బయటకెళ్లినప్పుడు కారులో కూర్చుని కంటి రక్షణ కోసం కళ్లపై ఏదో పరికరం పెట్టుకుంటుంది.
9 గంటలకు షూటింగ్ కు వెళ్తోంది. లేదా ఇతర పనులు చేసుకుంటోంది. ఈవెనింగ్ 6 గంటలకు రెడ్ లైట్ థెరపీ తీసుకుంటుంది. ఇక నైట్ 7 గంటలకు పికెల్ బాల్ ఆడి.. 9. 30 కు మెడిటేషన్ చేస్తుంది. చివర్లో రాత్రి 10 గంటలకు పడుకుంటానని' వీడియోలో సామ్ వెల్లడించింది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు.. సామ్ అందుకే అంత ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తుంది. సామ్ బ్యూటీ వెనక రహస్యం ఇదేనా? సామ్ టైమ్ టేబుల్ ఫాలో అయితే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటారు. అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











