Anu Emmanuel: రెడ్ శారీలో అనూ ఇమాన్యుల్ అందాలు అదిరిపోలా..!
అనూ ఇమాన్యుల్.. ఈమె పేరు గుర్తుకు వస్తే చాలు ఆమె అందాలు కళ్లముందు కదలాడతాయి. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈ క్యూట్ బ్యూటీకి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో అందరినీ కట్టి పడేసింది. 2016లో మజ్ను సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. న్యాచురల్ స్టార్ నానీ పక్కన నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్ చిత్రంలోనూ కనిపించి అందరినీ మాయ చేసేసింది.
ముఖ్యంగా అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, గీతా గోవిందం వంటి చిత్రాల్లోనూ అదరగొట్టింది. శైలజా రెడ్డి అల్లుడు సినిమా అనూ రెడ్డిగా కనిపించి యాక్టింగ్ ఇరగదీసింది. అక్కినేనా నాగచైత్యకు సమానంగా నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందిందీ క్యూట్ బ్యూటీ. అలాగే అల్లుడు అదుర్స్, మహా సముద్రం, ఊర్వశివో రాక్షసివో, ఇటీవల మాస్ మహారాజా హీరోగా వచ్చిన రావణాసుర చిత్రంలోనూ ఛాన్సు దక్కించుకొని నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ భాషల్లోనూ చాలానే చిత్రాలు చేసింది.

ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తుంటుంది. ఓ వైపు తెలుగు, మరోవైపు తమిళ, మలయాళ అభిమానులకు ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తన అప్ డేట్లను అందిస్తుంది. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను వివరిస్తుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ కట్టుకొని అదరగొట్టింది.

ముఖ్యంగా డీప్ అండ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న అనూ ఇమాన్యుల్.. చాలా అందంగా కనిపిస్తోంది. పెద్ద చోకర్, బిగ్ బ్యాంగిల్స్ తో పాటు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్న అనూ.. రెడ్ కలర్ చీరకు మ్యాచింగ్ గా రెడ్ కలర్ బొట్టు కూడా పెట్టుకుంది. ఈ ఫొటోల్లో అనూ ఇమాన్యుల్ చాలా అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎద అందాలు మాత్రం చాలా హైలెట్ అయ్యాయి. అలాగే మరో ఫొటోలో బెడ్డుపై కూర్చొని బాడీ షేపులన్నీ కనిపించేలా ఫొటోలు దిగింది. అందులో కూడా ఆమె అందాలన్నీ హైలెట్ అయ్యాయి.

అనూ ఇమాన్యుల్ షేర్ చేసిన ఈ ఫొటోలకు కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చాయి. అలాగే వేలల్లో కామెంట్లు వచ్చాయి. 2 మిలియన్ ఫాలోవర్స్ ను కల్గిన అనూ చేతిలో ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేవు. అయినా తానేమీ ఫీలవ్వకుండా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. దర్శక, నిర్మాతల కళ్లల్లో పడేందుకు సోషల్ మీడియాను వాడుకుంటూ ప్రయత్నాలు చేస్తోంది. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు ఫలించి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుందో లేదో.


Click it and Unblock the Notifications











