Apsara Rani: రాళ్లపై పడుకుని మరీ రచ్చ లేపుతున్న రామ్ గోపాల్ వర్మ బ్యూటీ.. చెక్కిన శిల్పమే!
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డేంజరస్ సినిమాలో హీరోయిన్ గా చేసిన అప్సర రాణి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తునే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందాలకు అనేక మంది ఫిదా అయిపోతుంటారు. ఈమె కూడా సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ తన అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ బ్లాక్ కలర్ సైడ్ కట్ డ్రెస్ లో సోకులు ఆరబోసింది. రాళ్లపై పడుకుని మరీ ఫొటోలకు ఫోజులు పెడుతూ రచ్చ లేపింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం 28 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ 4 లెటర్స్ సినిమా ద్వారా సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఉల్లాలా ఉల్లాలా, థ్రిల్లర్ వంటి సినిమాల్లోనూ నటించింది. అలాగే క్రాక్ చిత్రంలోనూ భూమ్ బద్దలు పాటలో స్టెప్పులేసింది. డీ కంపెనీ అనే సినిమాలోనూ అందాలు ఆరబోస్తూ.. రచ్చ చేసింది. ఇక సిటీమార్ సినిమా పెప్సీ ఆంటీ పాటలో అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన డేంజరస్ సినిమాలో నటించి మెప్పించింది. లెస్బియన్ గా కనిపించి అందరినీ షాక్ కు గురి చేసింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ద్వారానే ఈమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. కేవలం గుర్తింపే కాదండోయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.

అయితే ఎప్పుడూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే సరికొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అందాలను ఆరబోస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ సైడ్ కట్ ఉన్న డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఈ ఫొటోల్లో అప్సర రాణి.. పెద్ద పెద్ద రాళ్ల వద్ద హాట్ హాట్ ఫోజులు పెట్టింది. అందులో ఓ పెద్ద బండరాయిపై పడుకుని చాలా హాట్ గా కనిపించింది. అంతేకాకుండా వాటిని పట్టుకుంటూ అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ... కుర్రకారుకు హీటెక్కిస్తోంది. ప్రస్తుతం అస్పర రాణి షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా... అంతా పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు.
అందంగా ఉన్నావు, అదిరిపోయావు, పిల్లికళ్ల భామ మరింత ముద్దుగా తయారైందిరోయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. నువ్వు మరిన్ని తెలుగు సినిమాల్లో నటించి మమ్మల్ని మెప్పించాలని కొందరు.. నీ అందాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయమ్మడు అని మరికొందరు.. 28ఏళ్ల వయసులోనే ఇంతందం ఏంటి తల్లి అంటూ పలువురు నెటిజెన్లు చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











