Hebah Patel: టమాటా పండు డ్రెస్‌లో యాపిల్ పండులా హెబ్బా.. 35 ఏళ్లంటే నమ్మడం కష్టమే!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అలా ఎలా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. అయితే ఈ చిత్రం ద్వారా ఈ క్యూట్ బ్యూటీకి అంతగా గుర్తింపు రాకపోయినా.. ఆ తర్వాత చేసిన కుమారి 21 ఏఫ్ సినిమాతో విపరీతమైన గుర్తింపు వవచ్చింది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ టమాటా పండు రంగు డ్రెస్ వేసుకుని యాపల్ పండులా మెరిసిపోయింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అలా ఎలా తర్వాత చేసిన కుమారి 21 ఎఫ్ చిత్రంతో హెబ్బా పటేల్ కు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంతోనే బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. ముఖ్యంగా తెలుగులో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా, తెలిసినవాళ్లు, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, అలా నిన్ను చేరి వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు కెరియర్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాదండోయ్ తన అదిరిపోయే అందమైన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది కూడా. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో టమాటా పండు రంగు లాంగ్ గౌన్ వేసుకుని హొయలు పోయింది. అదిరిపోయే ఫోజులు పెడుతూ.. ఫొటోలు కూడా దిగింది.

వాటినే పెబ్బా పటేల్ నెట్టింట పోస్ట్ చేయగా.. అంతా ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. టమాటా పండు డ్రెస్ లో యాపిల్ పండులాగే కనిపిస్తున్నావు క్యూటీ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. కేవలం అందాల ఆరబోతే కాకుండా.. అంతకు మించి ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. కైపుగా చూస్తూనే వారిని కవ్విస్తుంటుంది.

హాట్ అండ్ బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న ఈమె అందానికి చాలా మంది బానిసలే ఉన్నారు. కేవలం ఈమె అందాలను తిలకించేందుకే మాత్రమే అనేక మంది ఈమెను సామాజిక మాధ్యమాల వేదికగా ఫాలో అవుతుంటారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











