తెల్ల చీర.. మల్లెపూలు.. వాలుజడతో వయ్యారాలు ఒలకబోస్తున్న బ్యూటీని గుర్తు పట్టారా?

సినీతారల అందాల గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్భుతమైన అందాలు కల్గిన వీళ్లు.. దాన్నే పెట్టుబడిగా పెడుతూ సినిమాలు చేస్తుంటారు. యాక్టింగ్ స్కిల్స్ తో పాటు వీళ్లకు అందం కూడా చాలా ముఖ్యం. అందుకే దాన్ని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటారు. 50 ఏళ్ల వయసు వచ్చినా పాతికేళ్ల వాళ్లలాగే కనిపిస్తుంటారు. అలాంటి వాళ్లలో చాలా మంది హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారు. అయితే తాజాగా మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ మాత్రం వీళ్లకు చాలా డిఫరెంట్. కేవలం 32 ఏళ్ల వయసులోనే.. బొద్దుగా తయారై కుర్రకారును ఓ ఊపు ఊపుతోందీ క్యూట్ బ్యూటీ. ఆమె ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కేవలం 32 ఏళ్ల వయసు కల్గిన హానీ రోజ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె.. ఇటీవలే బాలకృష్ణ హీరోగా చేసిన వీర సింహారెడ్డి సినిమాలో కనిపించింది. కానీ తన వయసుకంటే రెట్టింపు వయసు కల్గిన హీరోకు తల్లిగా నటించింది. ఇలా అందరికీ షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈ మధ్య మరింత బొద్దుగా తయారు అయింది. కానీ అందాల ఆరబోత మాత్రం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. వయసు చాలా తక్కువే అయినా చూసేందుకు చాలా పెద్దదానిలా కనిపిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ 2005లో బాయ్ ప్రెండ్ అనే సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

Tollywood Heroine Honey Rose Stunning Saree Look Photos Goes Viral

తెలుగులో ఆలయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత కూడా అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, భాషల్లో కనిపిస్తూ.. సినీ ప్రియులకు బాగా దగ్గరైంది. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. అందులో తెల్ల చీర కట్టుకుని.. మల్లెపూలు కూడా పెట్టుకుంది. సౌరం వేసుకుని మరీ వాలు జడతో వయ్యారాలు ఒలకబోస్తూ కనిపించింది. ఈ చీరకు తగ్గట్లుగా వైట్ కలర్ డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ పెట్టుకున్న ఈమె అటో మూడు, ఇటో మూడో బ్యాంగిల్స్ కూడా వేసుకుంది. సన్ననీ ఈ తెల్ల జారే చీరలో హనీ రోజ్ మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tollywood Heroine Honey Rose Stunning Saree Look Photos Goes Viral

నీ అందాలు తట్టుకోలేకపోతున్నాం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాం అంటూ చాలా మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. తెల్ల చీరలో చాలా అందంగా కనిపిస్తున్నావు బ్యూటీ అని కొందరు.. నీ చూపుతోనే మమ్మల్ని చంపేస్తున్నావని మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X